BJP leader: మంత్రిపై సోషల్ మీడియాలో విమర్శలు చేసిన బీజేపీ నేత పరిస్థితి ఏంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-04-13T10:40:48+05:30 IST

రాష్ట్రమంత్రి సెంథిల్‌బాలాజీ పరువు ప్రతిష్టలను కించపరిచే విధంగా సామాజిక ప్రసార మాధ్యమాల్లో విమర్శలు చేసిన కోయంబత్తూరుకు

BJP leader: మంత్రిపై సోషల్ మీడియాలో విమర్శలు చేసిన బీజేపీ నేత పరిస్థితి ఏంటో తెలిస్తే..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రమంత్రి సెంథిల్‌బాలాజీ పరువు ప్రతిష్టలను కించపరిచే విధంగా సామాజిక ప్రసార మాధ్యమాల్లో విమర్శలు చేసిన కోయంబత్తూరుకు చెందిన బీజేపీ రాష్ట్ర శాఖ ఐటీ విభాగం నేత సెల్వకుమార్‌(Selvakumar)ను పోలీసులు అరెస్టు చేశారు. సెల్వకుమార్‌ తన ట్విట్టర్‌పేజీలో మంత్రి సెంథిల్‌బాలాజీని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఘర్షణలకు దారితీసే కామెంట్లు కూడా పెట్టారు. ఈ విషయమై కోయంత్తూరు గణపతిపుదూరుకు చెందిన సురే్‌షకుమార్‌ అక్కడి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్వకుమార్‌ చేస్తున్న విమర్శలు ఇరువర్గాల మధ్య చిచ్చుపెట్టే రీతిలో ఉన్నాయని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సెల్వకుమార్‌ను అరెస్టు చేశారు.

అన్నామలై ఖండన... : సెల్వకుమార్‌ అరెస్టు పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) నిరసన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం తన ట్విట్టర్‌ పేజీలో అధికార డీఎంకేకి వ్యతిరేకంగా విమర్శలు చేసేవారిని పాలకులు అరెస్టు చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. డీఎంకే(DMK) ప్రభుత్వ అవినీతిని ఎండగట్టేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతుండటం వల్లే వారిని అరెస్టు చేస్తున్నారని, ఈ అరెస్టులకు తాము భయపడే ప్రసక్తే లేదన్నారు.

Updated Date - 2023-04-13T10:40:48+05:30 IST