Chandra Babu Arrest : ప్రజాస్వామ్యానికే అవమానకరం : సీఎం రమేశ్
ABN , First Publish Date - 2023-09-09T10:42:22+05:30 IST
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్ చేయడాన్ని బీజేపీ ఎంపీ డాక్టర్ సీఎం రమేశ్ తీవ్రంగా ఖండించారు.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్ చేయడాన్ని బీజేపీ ఎంపీ డాక్టర్ సీఎం రమేశ్ తీవ్రంగా ఖండించారు. ఆయనను అక్రమంగా అరెస్ట్ చేయడంలో పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికే అవమానకరంగా ఉందన్నారు. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, విచారణ చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా, అర్ధరాత్రి ఓ ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం కేవలం కక్ష సాధింపు మాత్రమేనని ఆరోపించారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గతంలో అరెస్ట్ చేయడానికి ముందు అనేకసార్లు విచారించి, నోటీసులు ఇచ్చి, అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నదీ చెప్పకుండా జగన్‌ను అరెస్ట్ చేయలేదన్నారు.
ప్రజాస్వామ్యంలో ఇటువంటి కక్ష సాధింపులకు స్థానం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలను మానుకోవాలన్నారు. పోలీసుల తీరును ఖండిస్తున్నానని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Chandra Babu Arrest : చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి