BJP MP: బీజేపీ ఎంపీ ఎంత మాట అనేశారేంటో..
ABN , First Publish Date - 2023-04-16T11:30:18+05:30 IST
భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ఒక వేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాలిబాన్ సంస్కృతి ఖాయమని మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్సింహ(Mysore BJP MP Pratap Simha) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మైసూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక ఎ న్నికల్లో గెలుపొందేందుకు కాంగ్రెస్ ఎస్‌డీపీఐ, పీఎఫ్ఐ, కేఎఫ్‌డీ వంటి ఉగ్రవాద సంస్థలతో లోపాయికారి ఒప్పందాలను కుదర్చుకుంటోందని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తమై కాంగ్రె్‌సను చిత్తుగా ఓడించాలని బీజేపీకి పూర్తి మెజార్టీ ఇవ్వాలని ఆయన సూచించారు. 2047 నాటికి భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు కుట్రలు పన్నుతున్న ఉగ్రవాదులు, వేర్పాటు వాదులు, సంఘ విద్రోహక శక్తులతో కాంగ్రెస్ అంటకాగుతోందని ఆ యన విరుచుకుపడ్డారు. బీజేపీ(BJP) అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలలోనూ శాంతి భద్రతలు దివ్యంగా ఉన్నాయని, తోకాడించే శక్తుల పీచమణిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కాగా ఎంపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. బీజేపీదే తాలిబాని మనస్తత్వమని విరుచుకుపడింది. నాలుగేళ్ల పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే విద్వేషపూర్తి అజెండాను తెరపైకి తెచ్చారని, ప్రజలు ఎవరికి బుద్దిచెబుతారో తెలుసుకునేందుకు మరో నెల రోజులు ఆగాలని బీజేపీ నేతలకు కాంగ్రెస్ సూచించింది.