BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-05-18T12:22:16+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...
పెరంబూర్(చెన్నై): అసమర్థ డీఎంకే ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు అధికమయ్యాయని, ఇది ప్రజా పాలనా? సంఘ విద్రోహుల ప్రభుత్వ మా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) బుధవారం ఆయన తన ట్విట్టర్లో ప్రశ్నించారు. అనుమతి లేకుండా కళ్లకుర్చి జిల్లా చిన్నమలైలో ఏర్పాటు చేసిన పార్టీ స్తంభాన్ని తొలగించాలని చిన్నమలై రెవెన్యూ తహసీల్దార్‌ను డీపీఐ జిల్లా అధ్యక్షుడు ధనపాల్ అసభ్యంగా దూషించడంతో పాటు కాళ్లు, చేతులు విరగ్గొడతానిని బెదిరిం చాడన్నారు. పోలీసుల సాక్షిగా మహిళా అధికారిని బెదిరించే ధైర్యం ఎలా వచ్చింద న్నారు. అసమర్థ డీఎంకు పాలనలో ప్రభుత్వ అధికారులకు బెదింపులు అధికమ య్యాయని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, నిజాయితీగా వ్యవహ రిస్తున్న ప్రభుత్వ అధికారులకు భద్రత కల్పించాలని అన్నామలై డిమాండ్ చేశారు.