BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఆ పథకానికి నిధులు కేంద్రానివేగా..
ABN , First Publish Date - 2023-09-15T09:10:54+05:30 IST
ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం విడుదల చేసిన నిధులతోనే డీఎంకే ప్రభుత్వం గృహిణులకు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం విడుదల చేసిన నిధులతోనే డీఎంకే ప్రభుత్వం గృహిణులకు రూ.1000ల పథకాన్ని అమలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో ఎస్సీ, ఎస్టీ నిధులను గృహిణులకు రూ.1000ల పథకానికి బదిలీ చేశారని చెబితే బీజేపీ ఆ పథకాన్నే వ్యతిరేకిస్తోందంటూ డీఎంకే నేతలు విమర్శలు చేస్తున్నారని తెలిపారు.