BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన ప్రకటన.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

ABN , First Publish Date - 2023-05-20T12:25:07+05:30 IST

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంచలన ప్రకటన చేశారు. ఈ నెల 30 నుంచి జూన్‌ 30 వరకు తాను రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్టు

BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన ప్రకటన.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సారా నిరోధానికి పటిష్ఠ చర్యలు చేపట్టేలా బీజేపీ ప్రత్యేక కమిటీ ఈ నెల 21న రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని కలుసుకుని వినతిపత్రం సమర్పించనున్నదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(President Annamalai) తెలిపారు. కోయంబత్తూరు సెల్వం మహల్‌లో శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత అన్నామలై మీడియాతో మాట్లాడుతూ... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రత్యేకించి ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు తెలియజేసేలా ఈ నెల 30 నుంచి జూన్‌ 30 వరకు తాను రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర(Padayatra) చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. బీజేపీ(BJP) కార్యనిర్వాహక కమిటీ సమావేశానికి పార్టీ నిర్వాహకులు పలువురు తమ జల్లికట్టు ఎద్దులను, తాను పెంచుతున్న జల్లికట్టు ఎద్దును తీసుకువచ్చినట్లు తెలిపారు. జల్లికట్టుకు మద్దతుగా సుప్రీంకోర్టు తీర్పువెలువరించడానికి ప్రధాన కారకుడు ప్రధాని నరేంద్రమోదీయేనని తెలియజేసేందుకే ఈ సమావేశానికి జల్లికట్టు ఎద్దులను తీసుకువచ్చినట్లు చెప్పారు. ఇక రాష్ట్రంలో సారా నిరోధించేందుకు చర్యలు చేపట్టడంలో డీఎంకే ప్రభుత్వం విఫలం కావటంతో ఈ విషయమై పార్టీ ప్రత్యేక కమిటీ సభ్యులు ఈ నెల 21న గవర్నర్‌ ఆర్‌ఎన్‌రవిని కలుసుకుని వినతిపత్రం సమర్పించనుందని చెప్పారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు మంత్రి సెంథిల్‌బాలాజీ(Minister Senthilbalaji)పై కోర్టులో విచారణ జరుగనుండటంతో ఆయన మంత్రిపదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నామని అన్నామలై చెప్పారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సీటీ రవి, కో-ఇన్‌ఛార్జి డాక్టర్‌ పొంగులేటి సుధాకరరెడ్డి, ఆ పార్టీ జాతీయ కమిటీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, కేంద్ర మాజీమంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌, పార్టీ జాతీ య కమిటీ సభ్యుడు హెచ్‌ రాజా, శాసనసభ్యుడు నయినార్‌ నాగేంద్రన్‌, కేశవ వినాయకం తదితరులు పాల్గొన్నారు.

nani11.2.jpg

Updated Date - 2023-05-20T12:25:07+05:30 IST