BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ వివాదాస్పద కామెంట్స్.. మహానాడు బ్రహ్మాండమైనదేమీ కాదుగా..

ABN , First Publish Date - 2023-08-25T07:43:11+05:30 IST

మిత్రపక్షమైన అన్నాడీఎంకే పైనా విమర్శలు గుప్పించే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై(State BJP president Annamalai)

BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ వివాదాస్పద కామెంట్స్.. మహానాడు బ్రహ్మాండమైనదేమీ కాదుగా..

- అలాంటివి అంగీకరించలేం

- అన్నాడీఎంకే మహానాడుపై అన్నామలై

పెరంబూర్‌(చెన్నై): మిత్రపక్షమైన అన్నాడీఎంకే పైనా విమర్శలు గుప్పించే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై(State BJP president Annamalai) మరోమారు ఆ పార్టీ పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మదురైలో జరిగిన అన్నాడీఎంకే(AIADMK) మహానాడు బ్రహ్మాండమైనదేమీ కాదని, అలాంటి వార్తల్ని అంగీకరించలేమని వ్యాఖ్యానించారు. కోయంబత్తూర్‌ విమానాశ్రయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజకీయపార్టీలు తమ బలనిరూపణ కోసం పలు ప్రయత్నాలు చేస్తుంటాయన్నారు. అందులో బ్రహ్మాండం అనే మాట ఉండదన్నారు. ‘ఎన్‌ మన్‌ ఎన్‌ మక్కల్‌’ పాదయాత్రను వేలాది మంది స్వాగతిస్తున్నారని, దానికి కూడా బ్రహ్మాండం అనే మాట తాను ఉపయోగించలేనన్నారు. వయస్సు మీరిన ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌, నడవలేని మంత్రి పొన్ముడి తన పాదయాత్ర జాతి విద్వేషాలు రెచ్చగొడుతోందని చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పందంగా ఉన్నాయన్నారు. ‘నీట్‌’ వ్యవహారంలో గవర్నర్‌ తన బాధ్యత సక్రమంగా నిర్వహిస్తున్నారని, దీనిపై డీఎంకే నేతలు రాష్ట్రపతికి మాత్రమే విజ్ఞప్తి చేసుకోవాలన్నారు. కావేరి సమస్య ఇంత జఠిలం కావడానికి రాష్ట్రప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ‘చంద్రయాన్‌-3’ విజయం భారత్‌ విజయమని, దానిని తమిళుల విజయంగా భావించరాదన్నారు. మేకెదాటు డ్యాం వ్యవహారంలో రాష్ట్రప్రజల అభీష్టానికి అనుగుణంగా బీజేపీ వ్యవహరిస్తుందన్నారు. వచ్చే ఏడాది జనవరి 11వ తేది ‘ఎన్‌ మన్‌’ పాదయాత్ర 234 నియోజకవర్గాల్లో ముగిసే సమయంలో ఒక కొత్త రాజకీయ విప్లవం వస్తుందని అన్నామలై పేర్కొన్నారు.

nani2.jpg

Updated Date - 2023-08-25T07:43:13+05:30 IST