BJP state president: వారిలాగే నేనూ అధ్యక్షుడినే..
ABN , First Publish Date - 2023-03-08T08:11:42+05:30 IST
జయలలిత, కరుణా నిధిలాగే తానూ ఓ పార్టీకి అధ్యక్షుడినేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) స్పష్టం చేశారు.
పెరంబూర్(చెన్నై): జయలలిత, కరుణా నిధిలాగే తానూ ఓ పార్టీకి అధ్యక్షుడినేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) స్పష్టం చేశారు. చెన్నై విమానాశ్రయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గతంలో ద్రావిడ పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరేవారని, ప్రస్తుతం బీజేపీకి చెందిన వారు ద్రావిడ పార్టీల్లో చేరుతున్నారని, ఆ ప్రకారం రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని స్పష్టమైపోతోందన్నారు. పార్టీ అధ్యక్షుడు తీసుకొనే నిర్ణయాలను కొందరు వ్యతిరేకించడం సహజమేనని, అర్థం చేసుకున్న వారు నిర్ణయాలకు అనుగుణంగా పనిచేస్తారని, లేనివారు పార్టీ నుంచి వైదొలుతారన్నారు. అన్నాడీఎంకే, డీఎంకే నుంచి వైదొలిగిన వారిపై పార్టీ అధ్యక్షులుగా జయలలిత, కరుణానిధి(Jayalalithaa, Karunanidhi) ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో, తాను కూడా పార్టీ నుంచి వైదొలిగిన వారిపై చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కూడా కఠిన నిర్ణయాలు తప్పవన్నారు. పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకొనేందుకు వెళ్లబోనని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. తమ పార్టీకి మరో అధ్యక్షుడు వస్తే ఆయన ముందు కూర్చొని పార్టీకి జేజేలు పలుకుతానని అన్నామలై వ్యాఖ్యానించారు.