BJP state president: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన వ్యాఖ్యలు.. గవర్నర్‌ వ్యవహారంలో సీఎం ద్వంద్వ వైఖరి

ABN , First Publish Date - 2023-07-01T10:23:01+05:30 IST

గవర్నర్‌ వ్యవహారంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) ద్వంద్వవైఖరి అవలంబిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నా

BJP state president: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన వ్యాఖ్యలు.. గవర్నర్‌ వ్యవహారంలో సీఎం ద్వంద్వ వైఖరి

ప్యారీస్‌(చెన్నై): గవర్నర్‌ వ్యవహారంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) ద్వంద్వవైఖరి అవలంబిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పేర్కొన్నారు. చెన్నై విమానాశ్రయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న విజయ్‌భాస్కర్‌ను డిస్మిస్‌ చేయాలని అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఎంకే స్టాలిన్‌ గవర్నర్‌కు సిఫారసు చేశారని అయితే, ప్రస్తుతం శాఖలేని మంత్రిగా ఉన్న సెంథిల్‌ బాలాజిని మంత్రి పదవి నుంచి తొలగించే అధికారం గవర్నర్‌కు లేదని స్టాలిన్‌ పట్టుపడడం హాస్యాస్పదమన్నారు. సెంథిల్‌ బాలాజి అవినీతికి పాల్పడినట్లు సుప్రీంకోర్టు కూడా పేర్కొన్న విషయాన్ని సీఎం అర్థం చేసుకోవాలని అన్నామలై హితవు పలికారు.

రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడుతున్నారు

- బీజేపీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్‌

రాజ్యాంగ పరిరక్షణకు రాష్ట్ర గవర్నర్‌ పాటుపడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్‌ పేర్కొన్నారు. ఒక మంత్రిని పదవి నుంచి తొలగించే అధికారం గవర్నర్‌కు లేదనేది జనాభిప్రాయమేనని అయితే, అవినీతి కేసులో విచారణ పారదర్శకంగా సాగాలన్న ఉద్దేశంతోనే మంత్రి సెంథిల్‌ బాలాజిపై గవర్నర్‌ చేపట్టిన చర్యలు రాజ్యాంగబద్ధమేనని ఆమె అభిప్రాయపడ్డారు.

డిస్మిస్‌ చేసే అధికారం ఉంది

- బీజేపీ నేత హెచ్‌.రాజా

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిని డిస్మిస్‌ చేసే అధికారం గవర్నర్‌కు ఉందని బీజేపీ సీనియర్‌ నేత హెచ్‌.రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కరుణానిధి కేసులో మంత్రిని డిస్మిస్‌ చేసే అధికారం గవర్నర్‌కు ఉందని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పిందని, రాజకీయ న్యాయ పరిజ్ఞానం లేని వారు నోటికొచ్చినట్లు మాట్లాడడం సహజమేనని హెచ్‌.రాజా తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

Updated Date - 2023-07-01T10:23:01+05:30 IST