Bulldozer Action : మత ఘర్షణలు జరిగిన నుహ్‌లో హోటల్ కూల్చివేత

ABN , First Publish Date - 2023-08-06T11:30:23+05:30 IST

హర్యానాలోని నుహ్ జిల్లాలో ఇటీవల మత ఘర్షణలు జరిగిన నేపథ్యంలో అక్రమ కట్టడాల కూల్చివేత నాలుగో రోజు కూడా కొనసాగింది. ఆదివారం ఉదయం నుహ్‌లోని ఓ హోటల్ కమ్ రెస్టారెంట్‌ను అధికారులు కూల్చేశారు. దీనిని చట్టవిరుద్ధంగా నిర్మించారని అధికారులు తెలిపారు.

Bulldozer Action : మత ఘర్షణలు జరిగిన నుహ్‌లో హోటల్ కూల్చివేత

న్యూఢిల్లీ : హర్యానాలోని నుహ్ జిల్లాలో ఇటీవల మత ఘర్షణలు జరిగిన నేపథ్యంలో అక్రమ కట్టడాల కూల్చివేత నాలుగో రోజు కూడా కొనసాగింది. ఆదివారం ఉదయం నుహ్‌లోని ఓ హోటల్ కమ్ రెస్టారెంట్‌ను అధికారులు కూల్చేశారు. దీనిని చట్టవిరుద్ధంగా నిర్మించారని అధికారులు తెలిపారు. జలాభిషేక యాత్రపైకి ఈ హోటల్ పై నుంచి రాళ్లు రువ్వినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వ భూమిలో అక్రమంగా కొందరు ఇళ్లు నిర్మించుకోగా, మరికొందరు దుకాణాలను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేస్తున్నారు. వీరిలో కొందరు విశ్వ హిందూ పరిషత్ జూలై 31న నిర్వహించిన జలాభిషేక యాత్రపై దాడి చేశారనే ఆరోపణలు నమోదయ్యాయి. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని మనోహర్ లాల్ ఖట్టార్ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం కూడా అనుసరించి, గురువారం నుంచి ఈ అక్రమ కట్టడాలను బుల్డోజర్‌తో కూల్చేస్తోంది. ఇప్పటికే గుడిసెలు, మెడికల్ స్టోర్స్ వంటి అక్రమ కట్టడాలను కూల్చేసింది. ఆదివారం ఉదయం ఓ హోటల్ కమ్ రెస్టారెంట్‌ను బుల్డోజర్‌తో కూల్చేసింది. ఈ హోటల్‌‌పైన రాళ్లు పోగేసుకుని, యాత్రలో పాల్గొన్న భక్తులపైకి దుండగులు విసిరారని కేసు నమోదైంది.

ఇదిలావుండగా, ఈ కూల్చివేతలపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ హింసాకాండ వెనుక బిగ్ గేమ్ ప్లాన్ ఉందని హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ ఆరోపించారు. 216 మంది నిందితులను అరెస్ట్ చేశామని, 80 మందిని ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేశామని తెలిపారు.

ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే ఈ హింసాకాండ జరిగిందని, దీనిపై దర్యాప్తు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.


ఇవి కూడా చదవండి :

Taiwan Vs China : తైవాన్‌పై దాడికి చైనా సిద్ధమవుతోందా?

Hyderabad Student : అమెరికాలో ఆకలితో బాధపడుతున్న హైదరాబాద్ విద్యార్థినికి ఇండియన్ కాన్సులేట్ అండదండలు

Updated Date - 2023-08-06T11:30:23+05:30 IST