CM Arvind Kejriwal: కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణ అవకతవకలపై సీబీఐ దర్యాప్తు షురూ..

ABN , First Publish Date - 2023-09-27T19:44:27+05:30 IST

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వాసం పునరుద్ధరణ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం బంగ్లా పునరుద్ధరణలో ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నాంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ ప్రాథమిక విచారణను బుధవారంనాడు ప్రారంభించింది.

CM Arvind Kejriwal: కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణ అవకతవకలపై సీబీఐ దర్యాప్తు షురూ..

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నివాసం పునరుద్ధరణ వివాదం (residence renovation row)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం బంగ్లా పునరుద్ధరణలో ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నాంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ (CBI) ప్రాథమిక విచారణను బుధవారంనాడు ప్రారంభించింది.


''ఇది క్రిమినల్ కేసుకు సంబంధించిన ప్రాథమిక విచారణ కాదు. అయితే, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైనట్టుగా చెప్పవచ్చు. దర్యాప్తులో సీబీఐకి సాక్ష్యాలు దొరికితే అప్పుడు రెగ్యులర్ కేసు గానో, క్రిమినల్ కేసుగానో సీబీఐ రిజిస్టర్ చేస్తుంది'' అని అధికారులు తెలిపారు. సీఎం నివాసం పునరుద్ధరణకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను తమకు సమర్పించారని ఢిల్లీ పీడబ్ల్యూడీని సీబీఐ అధికారులు కోరారు. అక్టోబర్ 3వ తేదీకల్లా ఇందుకు సంబంధించిన ఫైళ్లను సర్పించాలని కూడా సీబీఐ ఆదేశించింది. బంగ్లా పునరుద్ధరణలో అనవసరమైన ఖర్చు చేశారా, ఆర్థిక అవకతవకలు జరిగాయా అనే అంశాలపై సీబీఐ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది.


'శీష్ మహల్' వివాదంపై బీజేపీ విమర్శలు

కొద్ది నెలల క్రితం సీఎం బంగ్లా పునరుద్ధరణలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో కేజ్రీవాల్ సర్కార్‌పై బీజేపీ విమర్శల దాడి మొదలుపెట్టింది. ఈ అంశాన్ని 'కేజ్రీవాల్ కా శీష్ మహల్' పేరుతో పిలవసాగింది. కేజ్రీవాల్ నివాసం రెప్లికాను కేజ్రీవాల్ నివాసం మందు ఉంచి, కేజ్రీవాల్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ నిరసనలు తెలిపింది.

Updated Date - 2023-09-27T19:44:27+05:30 IST