CBN Arrest: చంద్రబాబు అక్రమ అరెస్టుపై కొనసాగుతున్న నిరసనలు
ABN , First Publish Date - 2023-09-20T12:46:03+05:30 IST
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(Former Chief Minister Nara Chandrababu) నాయుడు
బళ్లారి(బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(Former Chief Minister Nara Chandrababu) నాయుడు అక్రమ అరెస్ట్‌పై నిరసనలు కొనసాగుతున్నాయి. వినాయకచవితి నాడు సైతం తెలుగుసంఘాలు ఉద్యమిం చాయి. చంద్రబాబు అరెస్టు, రిమాండ్ కు తరలింపు రోజు నుంచి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు లాంటి విజన్ ఉండే గొప్ప రాజకీయ నాయకుడును కేవలం రాజకీయ దురుద్దేశంతో కేసుల్లో ఇరికించడం ఇది ప్రజాస్వామ్యంకు పూర్తీ వ్యతిరేకం అని ప్రజాసంఘాల నాయకులు మండిపడుతున్నారు. బెంగళూరు నగరంతో పాటు బళ్లారి, విజయనగర, రాయచూరు, కొప్పళ, చిత్రదుర్గం, చెళ్లకెర, కొప్పళ, గంగావతి, హుబ్బళి, తదితర ప్రాంతాల్లో ఉండే వివిద సంఘాలు, అలాగే క్యాంపుల్లోలో ఉండే చంద్రబాబు అభిమాన సంఘాలు నిరసనలు, ర్యాలీలు జోరందుకున్నాయి. రోజురోజుకూ చంద్రబాబుకు మద్దత్తుగా కర్ణాటక రాష్ట్రంలో ఉండే అనేక తెలుగుసంగాలు, అక్కడ చదివి కర్ణాటకలో ఉద్యోగ రిత్యా స్థిరపడిన వారు. రైతులు, కమ్మసంఘాలు, ఎన్నీఆర్ అభిమాన సంఘాలు, బాలక్రిష్ణ అభిమాన సంఘాలు, ఇతర అభిమాన సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు నాటి నుండి చంద్రబాబును ఎటుంటి కేసులేకుండా విడుదల చేయాలనే డిమాండ్ ప్రజల నుండి పెరుగుతూనే ఉంది. బళ్లారిలో శనివారం తెలుగుదేశం పార్టీ అభిమానులు, చంద్రబాబు అభిమాన సం ఘాలు, తెలుగు సంఘాలు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. అలాగే నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం కంప్లి తాలూకాలో వేలాది మంది కలిసి చంద్రబాబుకు మద్దత్తుగా బైక్ ర్యాలీ చేశారు.
అలాగే నిరసన వ్యక్తం చేశారు. విజయనగర జిల్లా సోమవారం పెద్దఎత్తున తెలుగుసంఘాలు, వివిద సంఘాలు చేరి నిరసన వ్యక్తం చేశారు. సిరుగుప్ప, సింధనూరు, రాయచూరు, గంగావతి, శ్రీరామనగర, లక్ష్మినగర్‌క్యాంపు, బాలాజీనగర్‌క్యాంపు, ఇలా అనేక క్యాంపుల్లో తెలుగుసంఘాలు, ప్రజాసంఘాలు చంద్రబాబు నాయుడు అరెస్టు తీవ్రంగా తప్పిపడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దేశరాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఒక గొప్ప రాజనీతి కలిగిన వ్యక్తి అని, దేశంలో విజన్ అంటే ఏమిటో చెప్పిన మేధావి అని ప్రజలు తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టును విడుదలే కాదు అయన మీద పెట్టిన తప్పుడు కేసును ఉపసంహరించుకోవాలని లేకుండా ఉద్యమాలు తీవ్రతం చేస్తామని అవసరం అయితే విదేశాల్లో ఉండే తెలుగుసంఘాలు కూడా చంద్రబాబుకు అండగా నిలుస్తామని పేర్కొన్నాయి. చంద్రబాబు ను వెంటనే విడుదల చేయాలని లేకుంటే ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
జగన్ రాక్షస పాలన నుంచి విముక్తి లభించాలి
బళ్లారి సిటీ : జగన్ రాక్షస పాలన నుంచి ఏపీకి విముక్తి కలగాలని ప్రవాసాంధ్రులు నాయకులు అభిప్రాయపడ్డారు. నగరంలో కమ్మభవన నందు మంగళవారం ఎన్‌టీఆర్ విగ్రహానికి ప్రవాసాంధ్రులు పూలమాల వేసి చంద్రబాబు గారు కడిగిన ఆణిముత్యం వలే బయటికి రావాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో పలువురు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందులో భాగంగా ప్రభాకర్‌నాయుడు, కె. ఎర్రిస్వామి నాయుడు, గిరిగిట్ల రవి, గుర్రం లాల్‌మోహన్ , సందీప్, జోళపురం చౌదరి, వెంకటనాయుడు, మోహన్, నాని తదితరులు పాల్గొన్నారు.