CBSE Results : సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షా ఫలితాల విడుదల
ABN , First Publish Date - 2023-05-12T15:54:46+05:30 IST
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board of Secondary Education-CBSE) పదో తరగతి, పన్నెండో తరగతి పరీక్షల ఫలితాలు
న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board of Secondary Education-CBSE) పదో తరగతి, పన్నెండో తరగతి పరీక్షల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ఈ రెండు పరీక్షల్లోనూ బాలికలదే పైచేయిగా నిలిచింది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో పరీక్షలు రాసిన విద్యార్థినీ, విద్యార్థులు cbse.nic.in లేదా cbseresuts.nic.in ద్వారా తమకు లభించిన మార్కులను తెలుసుకోవచ్చు. లాగిన్ క్రెడెన్షియల్స్‌గా రోల్ నంబరు, స్కూల్ నంబరు, అడ్మిట్ కార్డ్ ఐడీలను ఉపయోగించాలి.
పదో తరగతిలో 93.12 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పన్నెండో తరగతిలో 87.33 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. DigiLocker, UMANG ప్లాట్‌ఫామ్స్ ద్వారా కూడా విద్యార్థినీ, విద్యార్థులు తమ పరీక్షల ఫలితాలను తెలుసుకోవచ్చు.
సీబీఎస్ఈ పన్నెండో తరగతి ఫలితాల్లో త్రివేండ్రం 99.91 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ 78.05 శాతంతో ఈ జాబితాలో అట్టడుగున ఉంది.
మెరిట్ లిస్ట్ లేదు
పదో తరగతి, పన్నెండో తరగతి విద్యార్థినీ, విద్యార్థుల ఉత్తీర్ణతకు సంబంధించిన మెరిట్ లిస్ట్‌ను ప్రచురించరాదని సీబీఎస్ఈ నిర్ణయించింది. అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు ఈ చర్య తీసుకుంది. అదేవిధంగా ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్, థర్డ్ డివిజన్‌లను కూడా ఇవ్వకూడదని నిర్ణయించింది.
సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు స్కోర్ చేసిన 0.1 శాతం మంది విద్యార్థినీ, విద్యార్థులకు మెరిట్ సర్టిఫికేట్లను ఇవ్వాలని నిర్ణయించింది.
సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలకు మొత్తం 21,84,117 మంది రిజిస్టర్ చేయించుకున్నారు. వీరిలో 21,65,805 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 20,16,779 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 93.12 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతిలో 44,297 మందికి 95 శాతం కన్నా ఎక్కువ మార్కులు పొందారు. 1,95,799 మంది 90 శాతం కన్నా ఎక్కువ మార్కులు పొందారు. పదో తరగతి పరీక్షల్లో బాలికలదే పైచేయి అయింది. ఈ పరీక్షల్లో బాలురు 92.27 శాతం మంది, బాలికలు 94.25 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. సీబీఎస్ఈ పన్నెండో తరగతి పరీక్షల్లో త్రివేండ్రం రీజియన్ (99.91 శాతంతో) ప్రథమ స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో బెంగళూరు, మూడో స్థానంలో చెన్నై నిలిచాయి. గౌహతి చివరి స్థానంలో ఉంది.
ఇదిలావుండగా, సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం గత ఏడాది కన్నా 1.28 శాతం తగ్గింది. గత ఏడాది 94.40 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ఈ ఏడాది 93.12 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
పన్నెండో తరగతిలో తగ్గిన ఉత్తీర్ణత శాతం
సీబీఎస్ఈ పన్నెండో తరగతి పరీక్షల్లో ఢిల్లీ విద్యార్థినీ, విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తగ్గిపోయింది. 2022లో 96.29 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, 2023లో 92.21 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఢిల్లీ నుంచి 3,51,462 మంది ఈ పరీక్షలకు హాజరుకాగా, 3,24,094 మంది ఉత్తీర్ణులయ్యారు.
సీబీఎస్ఈ పన్నెండో తరగతి పరీక్షా ఫలితాలను తెలుసుకోవాలంటే, రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ, పుట్టిన తేదీ ఉండాలి.
మోదీ అభినందనలు
సీబీఎస్ఈ పదో తరగతి, పన్నెండో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థినీ, విద్యార్థులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు.
ఇవి కూడా చదవండి :
Rajasthan: గెహ్లాట్‌కు ఆర్‍ఎస్ఎస్ ఫోబియా...బీజేపీ చీఫ్ ఫైర్..!
Karnataka election : ‘కింగ్‌మేకర్’ జేడీఎస్ సిద్ధం.. బీజేపీ, కాంగ్రెస్‌లకు సైగలు..