One Nation-One Election : ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ కోసం కేంద్రం మరో ముందడుగు

ABN , First Publish Date - 2023-09-01T09:53:27+05:30 IST

‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ (One Nation-One Election) కోసం కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind) అధ్యక్షతన ఓ కమిటీని శుక్రవారం ఏర్పాటు చేసింది.

One Nation-One Election : ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ కోసం కేంద్రం మరో ముందడుగు
Ramnath Kovind

న్యూఢిల్లీ : ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ (One Nation-One Election) కోసం కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind) అధ్యక్షతన ఓ కమిటీని శుక్రవారం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా లోక్ సభ, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించేందుకు కల అవకాశాలను పరిశీలించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఇతర సభ్యుల పేర్లతో ఓ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కాబోతోంది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఈ వివరాలను తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో ఈ వివరాలను తెలిపారు. ఈ సమావేశాల్లో ఉమ్మడి పౌర స్మృతి బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు, ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి.

లోక్ సభ, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే ఓటర్లు ఎంపీలు, ఎమ్మెల్యేలను ఒకే రోజున ఎన్నుకోవచ్చు.


ఇవి కూడా చదవండి :

Bomb Threat : ‘తాజ్ హోటల్‌ను ఇద్దరు పాకిస్థానీలు పేల్చేస్తారు’.. ముంబై పోలీసులకు బెదిరింపు ఫోన్ కాల్..

Former CM: సుమోటోగా మాజీ సీఎం అక్రమార్జన కేసు

Updated Date - 2023-09-01T11:20:17+05:30 IST