Chennai: మాయదారి గుండెపోటు మరో లేతప్రాణం తీసింది..
ABN , First Publish Date - 2023-03-28T16:33:42+05:30 IST
మరో లేతగుండె ఆగింది. వెడ్డింగ్ రిసెప్షన్‌లో సరదాగా డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు ఓ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్.. స్నేహితులు, అక్కడున్నవారంతా ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రికి తరలించేలోపే గుండెపోటు( heart attack)తో మృతిచెందాడు.
చెన్నై: మరో లేతగుండె ఆగింది. వెడ్డింగ్ రిసెప్షన్‌లో సరదాగా డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు ఓ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్.. స్నేహితులు, అక్కడున్నవారంతా ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రికి తరలించేలోపే గుండెపోటు( heart attack)తో మృతిచెందాడు. ఇటీవలి కాలంలో యువత గుండెపోటుతో ప్రాణాలు వదలడం ఆందోళన కలిగిస్తోంది.
చెన్నై(Chennai)లోని కోయంబేడు(Koyambedu) 100 ఫీట్ రోడ్డులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో వెడ్డింగ్ రిసెప్షన్(wedding reception) జరుగుతోంది. అతిథులు ఉత్సాహభరితమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న సమయం.. వారిలో ఒకరు సత్యసాయిరెడ్డి(Sathyasai Reddy) 21 ఏళ్ల ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి( Final ear engineering student). సత్యసాయి తన స్నేహితురాలి సోదరి వెడ్డింగ్ రిసెప్షన్‌కు వచ్చారు. రిసెప్షన్ డ్యాన్స్ ఫ్రోగ్రామ్‌లో సత్యసాయితోపాటు అందరూ సరదాగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇంతలో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. సత్యసాయిరెడ్డి నేలకూలిపోయాడు. కిందపడిపోయిన సత్యసాయి చెవి రక్తం రావడంతో అతని స్నేహితులు, అక్కడున్నవారంతా భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. సత్యసాయి అప్పటికే మృతిచెందాడని డాక్టర్లు చెప్పారు.
సత్యసాయి మరణానికి గల కారణాలు మొదట తెలియరాలేదు. అయితే అతను గుండెపోటుతో మృతిచెందాడని తర్వాత తేలింది. ఇటీవలి కాలంలో యువతలో గుండెపోటులు పెరిగాయి.. జిమ్ చేస్తూ ఒకరు.. డాన్స్ చేస్తూ మరొకరు.. ఆటలాడుతూ ఇంకొకరు.. రన్నింగ్ చేస్తూ ఇలా .. చాలా మంది చిన్నవయస్సులోనే హార్ట్ స్ట్రోక్‌తో ప్రాణాలు వదిలారు. అయితే యువతలో గుండెపోటులో అనేదది ఇప్పుడు ఆందోళనకరంగా గురిచేస్తోంది. శారీరక శ్రమ లేకపోవడం, పొగాకు వినియోగం, మద్యపానం, జీవనశైలి ఎంపికలు అన్నీ గుండె జబ్బులకు కారణమవుతున్నాయని డాక్టర్ల చెబుతున్నారు. ఆరోగ్య సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వైద్య సంరక్షణ పొందడం అనేది చాలా ముఖ్యం.. భవిష్యత్తులో సత్యసాయి లాంటి దుర్ఘటనలు జరగకుండా నిరోధించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.