Chief Minister: మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ఎలా?

ABN , First Publish Date - 2023-03-19T10:18:23+05:30 IST

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కల్పించే పథకాల రూపకల్పన తదితర అంశాలపై రాష్ట్ర ఆర్థిక సలహా మండలి సభ్యు

Chief Minister: మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ఎలా?

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కల్పించే పథకాల రూపకల్పన తదితర అంశాలపై రాష్ట్ర ఆర్థిక సలహా మండలి సభ్యులతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) చర్చలు జరిపారు. శనివారం వేకువజామున క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా సామాజిక న్యాయాన్ని మరింత పటిష్ఠంగా అమలు చేసే దిశగా చేపట్టాల్సిన చర్యలపై, మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడంపై ఆయన మండలి సభ్యులతో సమీక్ష జరిపారు. ఈ చర్చల్లో మండలి సభ్యులు ఎస్తర్‌ డఫ్లో, రఘురామ రాజన్‌, డాక్టర్‌ అరవింద్‌ సుబ్రమణ్యన్‌, డాక్టర్‌ ఎస్‌ నారాయణన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, ఆర్థిక మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌, ఆర్థిక శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి మురుగానందం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాట్లాడుతూ రెండేళ్లుగా రాష్ట్ర పురోగమనానికి సంబంధించి తనకు తగిన సమయంలో సలహాలు ఇస్తున్నందుకు సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. వచ్చే యేడాది నుండి ఆర్థికపరంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి బలహీన వర్గాలకు కొత్తగా దీర్ఘకాలిక ప్రయోజనం కల్పించే పథకాలను రూపొందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా స్టాలిన్‌ చర్చలు జరిపారు.

nani4.jpg

Updated Date - 2023-03-19T10:18:23+05:30 IST