Share News

Chief Minister: ఆ పథకం.. రెండో విడతలో ఏడు లక్షల మందికి

ABN , First Publish Date - 2023-11-10T09:10:13+05:30 IST

కలైంజర్‌ మహిళా సాధికారిక పథకం రెండో దశను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) శుక్రవారం ప్రారంభించనున్నారు.

Chief Minister: ఆ పథకం.. రెండో విడతలో ఏడు లక్షల మందికి

- సీఎం స్టాలిన్‌ వెల్లడి

అడయార్‌(చెన్నై): కలైంజర్‌ మహిళా సాధికారిక పథకం రెండో దశను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) శుక్రవారం ప్రారంభించనున్నారు. తొలి దశలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ వివిధ కారణాలతో నిరాకరించిన 11.85 లక్షల దరఖాస్తుల్లో క్షేత్రస్థాయి తనిఖీల అనంతరం 7 లక్షల మందిని అర్హులుగా ఎంపిక చేశారు. వీరికి నెలకు రూ.1000 నగదు అందించే పథకాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ శుక్రవారం నుంచి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో అర్హులైన మహిళలను ఈ నగదు పంపిణీ పథకాన్ని సెప్టెంబరు 15 నుంచి ప్రభుత్వం అమలు చేస్తుంది. తొలి దశలో కోటి 60 లక్షల 50 వేల మందికి నెలకు రూ.1000 చొప్పున నగదును వారి బ్యాంకుల్లో జమ చేయడం మొదలైంది. అయితే, దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుల్లో దాదాపుగా 12 లక్షల దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత 7 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. ఇప్పటికే అర్హులైన లబ్ధిదారుల మొబైల్‌కు కూడా ఎస్‌ఎంఎ్‌సలు వెళ్ళాయి.

Updated Date - 2023-11-10T09:10:15+05:30 IST