Chief Minister: మేయర్, కౌన్సిలర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం.. అదేంటంటే..
ABN , First Publish Date - 2023-07-14T08:10:06+05:30 IST
రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్, చైర్మన్, కౌన్సిలర్లకు ఈ నెల నుండి గౌరవవేతనం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్, చైర్మన్, కౌన్సిలర్లకు ఈ నెల నుండి గౌరవవేతనం చెల్లించనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ప్రకటించారు. ఆ మేరకు మేయర్లకు ప్రతినెలా రూ.30వేలు, డిప్యూటీ మేయర్లకు రూ.15 వేలు, కార్పొరేటర్‌కు రూ.10 వేల చొప్పున గౌరవవేతనం చెల్లించనున్నారు. ఇదే విధంగా మున్సిపల్ చైర్మన్లకు రూ.15వేలు, డిప్యూటీ చైర్మన్లకు రూ.10వేలు, కౌన్సిలర్లకు రూ.5వేలు చొప్పున గౌరవవేతనం చెల్లిస్తారు. ఇక నగరపంచాయతీ అధ్యక్షుడికి రూ.10వేలు, ఉపాధ్యక్షుడికి రూ.5వేలు, సభ్యులకు రూ.2500లు చొప్పన గౌరవవేతనం చెల్లించనున్నారు. ఈ నెల నుండే ఈ గౌరవవేతనాలు చెల్లించనున్నామని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు.