China New Year : చాంద్రమానం ప్రకారం చైనా నూతన సంవత్సరం ఈరోజే

ABN , First Publish Date - 2023-01-22T14:20:45+05:30 IST

చైనీయులు చాంద్రమానం ప్రకారం నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. కుందేలు నామ సంవత్సరం ఆదివారం

China New Year : చాంద్రమానం ప్రకారం చైనా నూతన సంవత్సరం ఈరోజే
Rabbit Year Celebrations

బీజింగ్ : చైనీయులు చాంద్రమానం ప్రకారం నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. కుందేలు నామ సంవత్సరం ఆదివారం నుంచి ప్రారంభం కావడంతో కోవిడ్-19 మహమ్మారి భయాన్ని పక్కనబెట్టి ఆనందోత్సాహాలతో పండుగ చేసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా జీరో కోవిడ్ పాలసీని ఉపసంహరించడంతో సుమారు మూడేళ్ళ తర్వాత పెద్ద ఎత్తున జనం ప్రార్థనా స్థలాలకు వెళ్తున్నారు.

చైనా సంప్రదాయం ప్రకారం 12 రాశుల్లో ఒక్కొక్కదాని పేరు ఒక్కొక్క సంవత్సరానికి వస్తుంది. ఈ సంవత్సరం కుందేలు నామ సంవత్సరం అయింది. నూతన సంవత్సర వేడుకలను స్ప్రింగ్ ఫెస్టివల్ అని పిలుస్తారు. ప్రభుత్వం ఆంక్షలను ఎత్తేయడంతో క్వారంటైన్, లాక్‌డౌన్ వంటి భయాలేవీ లేకుండా ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్తున్నారు.

బీజింగ్‌లో గత ఏడాది కన్నా ఎక్కువ సంబరంగా ఈ వేడుకలను జరుపుకుంటున్నారు. వేలాది సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Updated Date - 2023-01-22T14:20:48+05:30 IST