Circus Legend: భారత సర్కస్ లెజెండ్ శంకరన్ కన్నుమూత
ABN , First Publish Date - 2023-04-24T12:25:08+05:30 IST
భారత సర్కస్ లెజెండ్, జెమినీ సర్కస్ వ్యవస్థాపకుడు శంకరన్ (99) అనారోగ్యంతో...
కన్నూర్ (కేరళ): భారత సర్కస్ లెజెండ్, జెమినీ సర్కస్ వ్యవస్థాపకుడు శంకరన్ (99) అనారోగ్యంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు.(Circus Legend) వార్ధక్యంతో తీవ్ర అనారోగ్యానికి గురైన శంకరన్ కొంతకాలంగా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.శంకరన్(Gemini Sankaran) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించారు.(Dies) భారతీయ సర్కస్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో శంకరన్ ప్రధాన పాత్ర పోషించారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కొనియాడారు.ప్రగతిశీల దృక్పథం ఉన్న శంకరన్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. శంకరన్‌కు పలువురు ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ఇతర ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి.శంకరన్ మృతి దేశంలోని సర్కస్ కళకు తీరని లోటు అని విజయన్ పేర్కొన్నారు.1924వ సంవత్సరంలో జన్మించిన శంకరన్ ప్రముఖ సర్కస్ కళాకారుడు కీలేరి కున్హికన్నన్ వద్ద మూడేళ్లపాటు శిక్షణ పొందారు. తర్వాత సైన్యంలో చేరిన శంకరన్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పదవీ విరమణ చేశారు.దేశవ్యాప్తంగా వివిధ సర్కస్ గ్రూపులతో కలిసి పనిచేసిన తర్వాత 1951వ సంవత్సరంలో విజయా సర్కస్ కంపెనీని కొనుగోలు చేసి జెమినీ సర్కస్‌గా పేరు మార్చారు. తర్వాత ఇతను తన రెండవ కంపెనీ జంబో సర్కస్‌ను ప్రారంభించారు.దేశంలో సర్కస్‌కు ఆయన చేసిన మొత్తం సహకారాన్ని పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం అతన్ని జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించింది.శంకరన్‌కు ఇద్దరు కుమారులు,ఒక కుమార్తె ఉన్నారు.