Home » Pinarayi Vijayan
కేరళ తిరువనంతపురంలోని వామనపురంలో ఈ ఘటన జరిగింది. రోడ్డుపై కాన్వాయ్ వెళ్తుండగా ఎదురుగా స్కూటర్ వచ్చింది. ఊహించని ఈ పరిణామంతో ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని 5 కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి.
కేరళలోని వయనాడ్‌లో(Wayanad landslide) కొండచరియలు విరిగిపడిన తరువాత, సాయుధ దళాలు, ఎన్డీఆర్ఎఫ్, ప్రభుత్వ యంత్రాంగంతో కూడిన ప్రధాన రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది.
దేవభూమి కేరళపై ప్రకృతి ప్రకోపించింది. వయనాడు జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. తర్వాత భారీ వర్షం కూడా కురిసింది. ఆ ప్రభావం కొన్ని గ్రామాలపై పడింది. 350 మందికి పైగా చనిపోగా, వందల సంఖ్యలో గాయపడ్డారు. ఆ క్రమంలో అటవీ అధికారులు చేపట్టిన సహాయక చర్యలను యావత్ దేశం ప్రశంసిస్తోంది. వారు నిజంగా హీరోలు అని కేరళ సీఎం పినరయి విజయన్ కొనియాడారు. ఫారెస్ట్ అధికారులను సోషల్ మీడియా ఆకాశానికి ఎత్తేసింది.
భారీ వర్షాలు, వరదలతో(Kerala Landslides) అతలాకుతలం అయిన కేరళ రాష్ట్రం వయనాడ్‌కు భారత వాతావరణ శాఖ ముందుగానే రెడ్ అలర్ట్ జారీ చేసిందన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను సీఎం పినరయి విజయన్ ఖండించారు.
కేరళలోని వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడి సంభవించిన ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య 93కు చేరింది. ఎప్పటికిప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆర్మీతో సహా ప్రకృతి వైపరీత్యాల బృందాలు నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్లలో నిమగ్నమయ్యారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా మంగళవారం, బుధవారం రెండ్రోజుల పాటు సంతాప దినాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
కేరళలో కొండచరియలు విరిగిపడ్డాయి. వయనాడు జిల్లా మెప్పాడి వద్ద మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఓ కొండ చరియ విరిగిపడింది. తర్వాత తెల్లవారు జామున 4.10 గంటలకు మరొ కొండ చరియ పడింది. కొండ చరియలు పడటంతో ఎనిమిది మంది చనిపోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. 16 మంది గాయపడ్డారు. వారికి మెప్పాడిలో గల ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
కొండచరియలు విరిగిపడటంతో వయనాడులో పరిస్థితి భీతావాహంగా మారింది. మెప్పాడిలో గల పలు ప్రాంతాల్లో కొండచరియలు నేరుగా ఇళ్లపై పడ్డాయి. దీంతో 24 మంది వరకు చనిపోయారని అధికారులు ప్రకటించారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా కేరళ ప్రభుత్వం ఆర్మీ సాయం కావాలని కోరింది.
'ఇండియా' కూటమిలో మిత్రులు, కేరళలో ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేరళ సీపీఎం నేత, ముఖ్యమంత్రి పినరయి విజయన్ మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది. రాహుల్ గాంధీ ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలపై పినరయి విజయన్ శుక్రవారం ఘాటుగా స్పందించారు. మీ నాన్నమ్మ కూడా జైలుకు వెళ్లారని గుర్తుచేశారు.
కేరళకు చెందిన అబ్దుల్ రహీమ్ కోసం.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ రవి రంగంలోకి దిగారు. అతడిని మరణ శిక్ష నుంచి రక్షించేందుకు సాక్షాత్తు సీఎం నడుం బిగించారు. ఆ క్రమంలో అతడిని రక్షించేందుకు నేను సైతం అంటూ ప్రపంచంలోని మలయాళీలంతా కదిలి రావాలని ఆయన పిలుపు నిచ్చారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ , ఆమె ఐటీ కంపెనీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝళిపించింది. మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం.