Share News

Cocaine seized: ఇండోనేషియా నౌక నుంచి రూ.230 కోట్ల కొకైన్ స్వాధీనం

ABN , First Publish Date - 2023-12-01T18:45:22+05:30 IST

ఒడిశాలోని పారాదీప్ పోర్ట్‌లో లంగరు వేసిన ఇండోనేషియా కార్గో షిప్‌లో రూ.220 కోట్లు విలువచేసే కొకైన్ పట్టుబడింది. ఒడిశా పోలీసులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా జరిపిన సోదాల్లో ఈ కొకైన్ పట్టుబడింది.

Cocaine seized: ఇండోనేషియా నౌక నుంచి రూ.230 కోట్ల కొకైన్ స్వాధీనం

భువనేశ్వర్: ఒడిశా (Odisha)లోని పారాదీప్ పోర్ట్‌లో లంగరు వేసిన ఇండోనేషియా కార్గో షిప్ (Indonesian cargo ship)లో రూ.220 కోట్లు విలువచేసే కొకైన్ (Cocaine) పట్టుబడింది. ఒడిశా పోలీసులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CIDSF), కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా జరిపిన సోదాల్లో ఈ కొకైన్ పట్టుబడింది.


ఎంవీ దేబి పేరుతో ఉన్న ఇండోనేషియన్ నౌక డెన్మాన్‌కు వెళ్లే మార్గంలో పారాదీప్ ఇంటర్నేషనల్ పోర్ట్‌లో లంగరు వేసినప్పుడు ఈ అక్రమ కొకైన్ పట్టుబడినట్టు భువనేశ్వర్ కస్టమ్స్ కమిషనర్ హహదేవ్ చంద్ర తెలిపారు. నౌకలో అనుమానాస్పద ప్యాకెట్లు ఉన్నట్టు అందులో పనిచేసే క్రేన్ ఆపరేటర్ ఒకరు మంగళవారంనాడు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చాడని, దీంతో డాగ్ స్క్వాడ్‌తో సహా అధికారులు షిప్‌పై దాడి చేసి ఆ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. తొలుత ఆ అనుమానాస్పద వస్తువులను పేలుడు పదార్ధాలుగా భావించామని, అయితే ఆ ప్యాకెట్లను స్కానింగ్ చేయడంతో చిన్నచిన్న ప్యాకెట్లలో డ్రగ్స్ చుట్టి ఉన్నట్టు బయటపడిందని చెప్పారు. దీనిని కొకైన్‌గా గుర్తించామన్నారు. ప్యాకెట్ల శాంపుల్స్‌ను ప్రభుత్వ ల్యాబొరేటరీ టెస్టులకు పంపించినట్టు ఆయన వివరించారు. కొకైన్ సమాచారంపై నౌకా సిబ్బందిని ప్రశ్నిస్తున్నామనీ, అరెస్టులు చేసే అవకాశం కూడా ఉందని చెప్పారు. కిలో కొకైన్ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.10 కోట్ల వరకూ ఉంటుందని ఆయన వివరించారు.

Updated Date - 2023-12-01T19:37:19+05:30 IST