Delhi Sevices Bill: పెద్దల సభలో అమీతుమీ... ఎంపీలకు కాంగ్రెస్, ఆప్ విప్‌ల జారీ
ABN , First Publish Date - 2023-08-06T20:25:46+05:30 IST
న్యూఢిల్లీ: ఢిల్లీ సర్వీసుల బిల్లు (Delhi Services Bill) సోమవారంనాడు రాజ్యసభలో (Rajya sabha) కేంద్రం ప్రవేశపెట్టనుండటంతో బిల్లును వ్యతిరేకిస్తున్న విపక్ష పార్టీలు అమీతుమీకి సిద్ధమవుతున్నాయి. బిల్లు సభ ముందుకు వస్తున్న దృష్ట్యా పార్టీ ఎంపీలంతా తప్పనిసరిగా సభకు హాజరు కావాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ విప్‌లు జారీ చేశాయి.
న్యూఢిల్లీ: ఢిల్లీ సర్వీసుల బిల్లు (Delhi Services Bill) సోమవారంనాడు రాజ్యసభలో (Rajya sabha) కేంద్రం ప్రవేశపెట్టనుండటంతో బిల్లును వ్యతిరేకిస్తున్న విపక్ష పార్టీలు అమీతుమీకి సిద్ధమవుతున్నాయి. బిల్లు సభ ముందుకు వస్తున్న దృష్ట్యా పార్టీ ఎంపీలంతా తప్పనిసరిగా సభకు హాజరు కావాలని కాంగ్రెస్ (Congress), ఆమ్ ఆద్మీ పార్టీ (APP) విప్‌లు (Whips) జారీ చేశాయి. కాంగ్రెస్ పార్టీ మూడు లైన్ల విప్ జారీ చేయగా, ఆప్ సైతం ఇదే తరహా విప్ జారీ చేస్తూ, ఈనెల 7,8 తేదీల్లో తప్పనిసరిగా సభకు రాజ్యసభ ఎంపీలంతా సభకు హాజరుకావాలని ఆదేశించింది. ఢిల్లీలోని గ్రూప్-ఎ అధికారుల నియామకాలు, బదిలీలపై లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారం కట్టబెడుతూ కేంద్ర తీసుకువచ్చిన ఆర్డినెన్స్ స్థానే ఈ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah) రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.
కొద్దికాలంగా వివాదాస్పదంగా ఉన్న ఈ ఆర్డినెన్స్ బిల్లును అమిత్‌షా ఈనెల 3న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష సభ్యుల ప్రతిఘటన మధ్య మూజువాణి ఓటుతో బిల్లు నెగ్గింది. రాజ్యసభలోనూ బిల్లు గెలిస్తే బిల్లు అమల్లోకి వస్తుంది.
ఖర్గే కార్యాలయంలో విపక్ష ఫ్లోర్ లీడర్ల సమావేశం..
కాగా, ఆర్డినెన్స్ బిల్లు రాజ్యసభకు వస్తుండటంతో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు విపక్ష కూటమి I.N.D.I.A. ఫ్లోర్ లీడర్లంతా సోమవారం ఉదయం పార్లమెంటులోని మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో సమావేశం కానున్నారు. సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి విధించిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ ఆయన ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్ధరించచడంలో లోక్‌సభ స్పీకర్ చేస్తున్న జాప్యం, దీనిపై అనుసరించాల్సి వ్యూహంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.