Congratulations to ISRO team: చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంపై ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ప్రముఖులు
ABN , First Publish Date - 2023-07-14T18:32:17+05:30 IST
చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగం విజయవంతంపై ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ, కాంగ్రెస్ యువత నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan mohan Reddy), క్రికెటర్ సచిన్ అభినందనలు తెలిపారు.
చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగం విజయవంతంపై ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ, కాంగ్రెస్ యువత నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan mohan Reddy), క్రికెటర్ సచిన్ అభినందనలు తెలిపారు.
భారతదేశ అంతరిక్ష చరిత్రలో చంద్రయాన్-3 కొత్త అధ్యాయాన్ని లిఖించిందని, ఇది ప్రతి భారతీయుడి కలలు, ఆశయాలను ఉన్నతంగా ఎగురవేస్తుందని, ఈ మహత్తర విజయం మన శాస్త్రవేత్తల నిర్విరామ అంకితభావానికి నిదర్శనమని మోదీ ట్వీట్ చేశారు.
నేడు మనలో వందకోట్ల కంటే ఎక్కువ మంది గర్వంతో ప్రకాశిస్తూ ఆకాశం వైపు చూస్తున్నారని రాహుల్ అన్నారు. ఈ మిషన్ విజయవంతమైతే చంద్రుని ఉపరితలంపై అంతరిక్ష నౌకను ల్యాండ్ చేసిన నాల్గవ దేశంగా మనల్ని తీర్చిదిద్దుతుందని, ఇస్రో బృందానికి అభినందనలు తెలుపుతూ రాహుల్ ట్వీట్ చేశారు.
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం భారతీయులందరికీ మరపురాని రోజు...జై హింద్! అంటూ సచిన్ ట్వీట్ చేశారు. అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలందరికీ అభినందనలు తెలిపారు.
భారత దేశం గర్వించే విధంగా చంద్రయాన్-3 రాకెట్ ను నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు శాస్త్రవేత్తలు నింగిలోకి ప్రయోగించారు. షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం (Shaar Rocket Launch Center) రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి, ఎల్వీఎం-3 బాహుబలి రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు షార్‌కు తరలి వచ్చారు