Congress candidate: బళ్లారి కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరో తేలిపోయింది...

ABN , First Publish Date - 2023-04-16T10:49:02+05:30 IST

బళ్లారి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎవరో ఎట్టకేలకు తేలిపోయింది.

Congress candidate: బళ్లారి కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరో తేలిపోయింది...

బళ్లారి(బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు బళ్లారి నగర అభ్యర్థిగా నారా భరత్‌రెడ్డి(Nara Bharat Reddy)ని కాంగ్రెస్‌ పార్టీ శనివారం ప్రకటించింది. దీంతో నెలరోజులుగా సాగుతున్న ఉత్కం ఠకు తెరపడినట్లైంది. ఈ టికెట్‌ కోసం దాదాపు 19 మంది పోటీ పడ్డారు. ప్రధానంగా ఐదుగురు మధ్య తీవ్ర పోటీ సాగింది. ఢిల్లీ స్థాయిలో ఆశావహులు పావులు కదిపారు. ఎట్టకేలకు శనివారం ప్రకటించిన మూడో జాబితాలో బళ్లారి నగర టికెట్‌ను నారా భరత్‌రెడ్డికి కేటాయించింది. దీంతో బళ్లారిలో నారా అభిమానులు, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, సంబరాలు చేసుకున్నారు.

ప్రస్థానం ఇది..: బళ్లారి అంటేనే కాకలు తీరిన రాజకీయ నాయకులు పుట్టిన గడ్డ. పైగా సోనియాగాంధీకి బళ్లారి అంటే ప్రత్యేక అభిమానం. ఇక్కడ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టికెట్‌ సాధించడం అంటే అంత సులభం కాదు. ఇక్కడ టికెట్‌ కోసం అనేక మంది రాజకీయ కురవృ ద్ధులు పోటీ పడ్డారు. అలాంటి టికెట్‌ కోసం నారా భరత్‌రెడ్డి పోటీ పడ్డాడు. ప్రముఖ గ్రానెట్‌ వ్యాపారి నారా సూర్య నారాయణరెడ్డి రెండో కుమారుడే ఈ నారా సూర్యనా రాయణరెడ్డి. ఇత ను ఎంబీఏ లండన్‌లో చదివా డు. అనంతరం బళ్లారిలోనే ఉంటూ అనేక సేవా కార్యక్ర మాలు చేస్తున్నారు. 34 ఏళ్ల భరత్‌ 2012 నుంచి టచ్‌ ఫర్‌ లైఫ్‌ అనే సేవా ట్రస్టు ఏర్పాటు చేసి ప్రజలకు అందు బాటులో ఉంటున్నాడు.

pandu7.2.jpg

కరోనా కాలంలో అనేక సేవా కార్యమాలు నిర్వహించి తనకం టూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల రాహూల్‌ గాంధీ(Rahul Gandhi) పాదయాత్రలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించాడు. బళ్లారి నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన వారిలో అత్యంత తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి ఇతనే. టికెట్‌ ఆశించిన కరువృద్ధులు ఢిల్లీ స్థాయిలో పావులు కదిపారు. భరత్‌కు టికెట్‌ రాకుండా కుట్రలు కూడా పన్నారు. కానీ అధిష్టానం మాత్రం ఎట్టకేలకు భరత్‌రెడ్డికే కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చింది. బళ్లారిలో గాలి జనార్దన్‌రెడ్డి(Gali Janardhan Reddy) భార్య గాలి అరుణ, బీజేపీ నుంచి గాలి సోమశేఖర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. దీంతో ఇప్పుడు బళ్లారి రాజకీయాలు చాలా ఆసక్తి కరంగా మారాయి.

Updated Date - 2023-04-16T10:49:02+05:30 IST