Karnataka Assembly Polls: టికెట్ కేటాయింపులతో నేతల ఫిరాయింపుల పర్వం

ABN , First Publish Date - 2023-04-17T12:27:27+05:30 IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పర్వంలో పలు పార్టీల నేతలు ఫిరాయింపుల పర్వానికి తెర లేపారు....

Karnataka Assembly Polls: టికెట్ కేటాయింపులతో నేతల ఫిరాయింపుల పర్వం
Congress MLA Srinivas Resigns

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పర్వంలో పలు పార్టీల నేతలు ఫిరాయింపుల పర్వానికి తెర లేపారు.(Karnataka Assembly Polls)ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస మూర్తి(Congress MLA Akhanda Srinivas Murthy) సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు.మూడు అభ్యర్థుల జాబితాల్లో తన పేరు లేకపోవడంతో పులకేశినగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ నేత అఖండ శ్రీనివాస్ మూర్తి రాజీనామా చేశారు.అసంతృప్త కాంగ్రెస్ నాయకుడు స్పీకర్ విశ్వేశ్వర్ హెగాడే కాగేరిని కలుసుకుని తన రాజీనామా లేఖను సమర్పించారు.

ఇది కూడా చదవండి : Karnataka: మనస్ఫూర్తిగా కాంగ్రెస్ చేరుతున్నా...మాజీ సీఎం జగదీష్ షెట్టార్

‘‘ కాంగ్రెస్ పార్టీ మూడు జాబితాలు విడుదల చేసినా నాకు టిక్కెట్ ఇవ్వలేదు,(Denial Of Ticket) నేను చాలా బాధపడ్డాను...అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు వచ్చాను’’ అని శ్రీనివాస్ మూర్తి చెప్పారు.తన నియోజకవర్గంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ ఐక్యంగా ఉన్నారని తెలిపారు. తనకు టికెట్ రాకపోవడంపై శ్రీనివాస్ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని.. మద్దతుదారులతో చర్చిస్తామని శ్రీనివాస్ మూర్తి తెలిపారు.కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Updated Date - 2023-04-17T12:27:27+05:30 IST