Karnataka polls: కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల...ఉచిత హామీలు
ABN , First Publish Date - 2023-05-02T10:47:39+05:30 IST
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మంగళవారం మేనిఫెస్టోను విడుదల చేసింది....
న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మంగళవారం మేనిఫెస్టోను విడుదల చేసింది.(Congress Releases Manifesto)త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం (Karnataka Assembly Election)కాంగ్రెస్ పార్టీ మంగళవారం సర్వ జనాంగద శాంతియ తోట పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది.200 యూనిట్ల ఉచిత విద్యుత్, కుటుంబ పెద్దలకు నెలకు రూ. 2,000, నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.3,000, డిప్లొమా ఉన్నవారికి నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామని కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ (KSRTC/BMTC) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది.
ఇది కూడా చదవండి:
ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను ఒక సంవత్సరంలోగా భర్తీ చేయడాన్ని కూడా కాంగ్రెస్ పరిశీలించనుంది.గృహ జ్యోతి, గృహ లక్ష్మి, అన్న భాగ్య, యువ నిధి, శక్తి. గృహ జ్యోతి పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు హామి ఇచ్చారు. అన్నభాగ్య పథకం కింద10కిలోల చొప్పున ఆహార ధాన్యాలను అందిస్తామని నేతలు చెప్పారు.కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉపాధి కల్పన, మహిళలకు సాధికారత, పేదరికాన్ని నిర్మూలించడంపై దృష్టి సారిస్తామని కాంగ్రెస్ నేత గౌరవ్ వల్లభ్ చెప్పారు. ఈ మేనిఫెస్టోను కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున్ ఖర్గే, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లు విడుదల చేశారు.