Modi Vs Sonia : మోదీకి సోనియా గాంధీ ఘాటు లేఖ
ABN , First Publish Date - 2023-09-06T13:36:28+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ (Sonia Gadhi) బుధవారం ఓ లేఖ రాశారు. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల ఎజెండాను వెల్లడించాలని కోరారు.
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ (Sonia Gadhi) బుధవారం ఓ లేఖ రాశారు. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల ఎజెండాను వెల్లడించాలని కోరారు. ఈ సమావేశాల్లో 9 అంశాలపై చర్చించేందుకు తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇతర రాజకీయ పార్టీలతో సంప్రదించకుండానే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించేందుకు నిర్ణయించారని దుయ్యబట్టారు. ఈ సమావేశాల ఎజెండా గురించి ప్రతిపక్షాలకు తెలియడం లేదన్నారు.
పార్లమెంటులో చర్చించాలని సోనియా గాంధీ కోరుతున్న అంశాలు :
1. దేశంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, పెరుగుతున్న నిరుద్యోగం, అసమానతల పెరుగుదల, ఎంఎస్ఎంఈల దుస్థితి.
2. పంటలకు కనీస మద్దతు ధర విషయంలో రైతులకు, రైతు సంఘాలకు భారత ప్రభుత్వం ఇస్తున్న భరోసా. వారు చేస్తున్న ఇతర డిమాండ్లపై ప్రభుత్వ చర్యలు.
3. వెల్లడవుతున్న అన్ని అంశాల దృష్ట్యా అదానీ గ్రూప్ వ్యాపార లావాదేవీలపై సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత దర్యాప్తు చేయించడం.
4. మణిపూర్ ప్రజలు ఎదుర్కొంటున్న ఆవేదన, రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యమవడం.
5. హర్యానా వంటి రాష్ట్రాల్లో మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతుండటం.
6. భారత భూభాగాన్ని చైనా నిరంతరం ఆక్రమించుకుంటుండటం, లడఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లలో సరిహద్దుల వద్ద భారత దేశ సార్వభౌమాధికారానికి సవాళ్లు ఎదురవుతుండటం.
7. కులాలవారీగా జనాభా లెక్కల సేకరణ అత్యవసరం.
8. కేంద్ర-రాష్ట్రాల మధ్య సంబంధాలకు జరుగుతున్న నష్టం.
9. కొన్ని రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు, మరికొన్ని రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాలు, వరదల వల్ల ఎదురవుతున్న పర్యవసానాలు.
ఇవి కూడా చదవండి :
Rahul Gandhi : యూరోప్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ?
India : ‘ఇండియా’ పేరుపై హక్కు పాకిస్థాన్‌దేనా?