Bharat Jodo: భారత్ జోడో యాత్రకు ఏడాది.. 7న దేశవ్యాప్తంగా జిల్లాల్లో పాదయాత్రలు
ABN , First Publish Date - 2023-09-03T16:27:31+05:30 IST
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ జరిపిన 'భారత జోడో యాత్ర' ఏడాది పూర్తికావస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈనెల 7వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ 'భారత్ జోడో యాత్ర'ను నిర్వహించనుంది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ జరిపిన 'భారత జోడో యాత్ర' (Bharat Jodo Yatra)కు ఏడాది పూర్తికావస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈనెల 7వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ 'భారత్ జోడో యాత్ర'ను నిర్వహించనుంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.
రాహుల్ గాంధీ గత ఏడాది సెప్టెంబర్‌లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 130 రోజుల పాటు భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర సక్సెస్ కావడంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీతో గెలిచింది. రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' రెండవ విడతను గుజరాత్ నుంచి మేఘాలయ వరకూ చేపడతారని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే ఇటీవల తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నందున దీనికి ముందే రాహుల్ రెండో విడత భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయని అంచనా వేస్తు్న్నారు.