Tamilnadu: చెన్నైలో మహిళా ఇన్‌స్పెక్టర్ అవినీతి బాగోతం..
ABN , First Publish Date - 2023-03-22T12:54:27+05:30 IST
చెన్నైలో మహిళా ఇన్‌స్పెక్టర్ (Female Inspector) అవినీతి (Corruption) బాగోతం వెలుగుచూసింది. రోడ్డు ప్రమాదాల్లో బాధితుల నుంచి భారీగా లంచాలు (Bribes) వసూలు చేస్తోంది.
Tamilnadu: చెన్నైలో మహిళా ఇన్‌స్పెక్టర్ (Female Inspector) అవినీతి (Corruption) భాగోతం వెలుగుచూసింది. రోడ్డు ప్రమాదాల్లో బాధితుల నుంచి భారీగా లంచాలు (Bribes) వసూలు చేస్తోంది. దీనిపై కొందరు బాధితులు (Victims) ఫిర్యాదు (Complaint) చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. దీంతో ఇన్‌స్పెక్టర్ రాణిని పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ (Suspend) చేశారు. ఆమె ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ విభాగం (Traffic Investigation Division)లో పనిచేస్తున్నారు. మూడు నెలలుగా ఆమెపై లంచం ఆరోపణలు వస్తున్నాయి. బాధితుల నుంచి లంచాలు డిమాండ్ చేస్తుందని, కేసులు సక్రమంగా విచారించడంలేదని ఆమెపై ఫిర్యాదులు చేయడంతో తమిళనాడు పోలీస్ శాఖ సమగ్రంగా దర్యాప్తుచేసి.. ఆరోపణలు నిజమని తేలడంతో సాంబ్రం పోలీస్ కమిషనర్ అమల్ రాజ్ సూచనల మేరకు అదనపు పోలీస్ కమిషనర్ కామిని ఆమెను సస్పెండ్ చేశారు.
ఇన్‌స్పెక్టర్ రాణి పోలీసు వాహనాన్ని నడపడం కోసం ప్రైవేట్ డ్రైవర్‌ను కూడా నియమించుకున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే రాణి ప్రైవేట్ డ్రైవర్‌తో అధికారిక వాహనంలో సంఘటనా స్థలానికి వెళుతుందని.. ఘటన స్థలానికి ఎంపిక చేసిన కొంతమంది న్యాయవాదులను కూడా తీసుకువెళ్లి బేరసారాలు చేస్తుందని తెలియవచ్చింది. ప్రమాద సమయంలో వచ్చే బీమా సొమ్ము మంజూరైన తర్వాత కూడా రాణీ లంచం తీసుకున్నట్లు సమాచారం. తనపై వచ్చే ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి ఆమె అనేక ప్రయత్నాలు చేసింది. అయితే ఇన్‌స్పెక్టర్‌ఫై చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు డిమాండ్ చేయడంతో పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టి.. రాణిని సస్పండ్ చేస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.