Assembly Elections - 2023: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఎన్నికల ప్రచారానికి తెర.. రేపే పోలింగ్
ABN , First Publish Date - 2023-11-16T18:48:28+05:30 IST
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో(Madyapradesh, Chattisgarh) అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేడు సాయంత్రం ముగిసింది. మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు.. ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశలో 70 నియోజకవర్గాలకు రేపు(నవంబర్ 17న) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.
భోపాల్, రాయ్‌పుర్: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో(Madyapradesh, Chattisgarh) అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేడు సాయంత్రం ముగిసింది. మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు.. ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశలో 70 నియోజకవర్గాలకు రేపు(నవంబర్ 17న) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.
డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీ(BJP), ప్రతిపక్ష కాంగ్రెస్(Congress)ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఎస్పీ, బీఎస్పీ, ఆప్ లు బరిలో ఉన్నా.. నామమాత్ర పోటీ ఇచ్చే అవకాశం ఉంది. మరి కొన్ని స్థానాల్లో ప్రధాన పార్టీల తిరుగుబాటు అభ్యర్థులు సైతం బరిలో నిలిచారు.
ప్రచార పర్వం ముగియడంతో సభలు, సమావేశాలు, ఊరేగింపులు, లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రచారం చేయడంపై ఈసీ(Election Commission) నిషేధం విధించింది. మధ్యప్రదేశ్‌లోని 230 స్థానాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 5.6 కోట్లు. వీరిలో పురుష ఓటర్ల సంఖ్య 2.88 కోట్లు కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 2.72 కోట్లు. రాష్ట్రంలో మొత్తం 22.36 లక్షల మంది యువత తొలిసారి ఓటు వేయనున్నారు.
ఛత్తీస్‌గఢ్ రెండో విడత ఎన్నికల్లో మొత్తం 958 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 20 స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ జరిగింది, మిగిలిన 70 స్థానాలకు రేపు రెండో దశ పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 958 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 1.63 లక్షల మంది ఓటర్లు ఓటును వినియోగించుకోనున్నారు. ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీల మధ్యే ప్రధాన పోరు కొనసాగనుంది.