Agnipath Scheme: అగ్నిపథ్ స్కీం విషయంలో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

ABN , First Publish Date - 2023-02-27T11:26:49+05:30 IST

అగ్నిపథ్ స్కీం విషయంలో ఢిల్లీ హైకోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది....

Agnipath Scheme: అగ్నిపథ్ స్కీం విషయంలో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
Delhi HC

న్యూఢిల్లీ : అగ్నిపథ్ స్కీం విషయంలో ఢిల్లీ హైకోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది.(Delhi high court) కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం(Agnipath Scheme) చెల్లుబాటును ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ,జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది.(Dismisses all petitions) భారత బలగాల రిక్రూట్ మెంట్ కోసం కేంద్రం అమలు చేస్తున్న అగ్నిపథ్ పథకం చెల్లుబాటును ఢిల్లీ హైకోర్టు సోమవారం సమర్థించింది.‘‘అగ్నిపథ్ పథకంలో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణం లేదు’’ అని హైకోర్టు పేర్కొంది.

ఇది కూడా చదవండి : Covid-19: కోవిడ్ ఏ ల్యాబ్ నుంచి లీక్ అయిందంటే...యూఎస్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్ సంచలన నివేదిక

గత ఏడాది డిసెంబర్ 15న తన ఆదేశాలను రిజర్వ్ చేసింది.గత ఏడాది జూన్ 14న ప్రకటించిన అగ్నిపథ్ పథకం సాయుధ దళాలలో యువకుల రిక్రూట్‌మెంట్ కోసం నియమాలను నిర్దేశించింది. ఈ పథకాన్ని ఆవిష్కరించిన తర్వాత, ఈ పథకానికి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి.తర్వాత ప్రభుత్వం 2022లో రిక్రూట్‌మెంట్ కోసం గరిష్ట వయోపరిమితిని 23 ఏళ్లకు పొడిగించింది. 2022వ సంవత్సరం జులై నెలలో ఈ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది.

ఇది కూడా చదవండి : Delhi Liquor Scam: సిసోడియా అరెస్టుపై ఆప్ నిరసనల వెల్లువ

కేరళ, పంజాబ్, హర్యానా, పాట్నా, ఉత్తరాఖండ్ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిల్‌లను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని లేదా పిటిషనర్లు తమ ముందు ఉంటే నిర్ణయం వెలువడే వరకు పెండింగ్‌లో ఉంచాలని సుప్రీం కోర్టు కోరింది.

Updated Date - 2023-02-27T11:26:51+05:30 IST