Himachal Pradesh: హిమాచల్‌లో వరద బీభత్సం..వరద కాల్వలో చిక్కుకున్న బస్సు..
ABN , First Publish Date - 2023-07-10T09:58:37+05:30 IST
భారీ వర్షాలతో ఉత్తర భారతదేశం వణికిపోతోంది. కొండచరియలు విరిగిపడటం, వరద బీభత్సంతో భారీ నష్టం సంభవించింది. ఇప్పటివరకు 28 మంది మృతిచెందినట్లు అధికారులు చెబుతున్నారు. జమ్మూకశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్‌లలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీచేశారు. 1982 తర్వాత ఢిల్లీలో జూలైలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి.
భారీ వర్షాలతో ఉత్తర భారతదేశం వణికిపోతోంది. కొండచరియలు విరిగిపడటం, వరద బీభత్సంతో భారీ నష్టం సంభవించింది. ఇప్పటివరకు 28 మంది మృతిచెందినట్లు అధికారులు చెబుతున్నారు. జమ్మూకశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్‌లలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీచేశారు. 1982 తర్వాత ఢిల్లీలో జూలైలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి. యమునా నది నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రతమ్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. భారీ వర్షాల కారణంగా ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఎన్‌సిఆర్‌లలో పాఠశాలలు మూసివేశారు.
హిమాచల్ ప్రదేశ్‌లో భారీవర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వికాస్‌నగర్ సమీపంలో హిమాచల్ ప్రదేశ్ రోడ్‌వేస్ బస్సు వరదల్లో చిక్కుకుపోయింది. స్థానికుల సాయంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు వరద కాలువలో చిక్కుపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.