Share News

Deep Fake: రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో వివాదం.. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

ABN , First Publish Date - 2023-11-11T11:41:25+05:30 IST

AI: ప్రముఖ హీరోయిన్, బ్యూటీ రష్మిక మందన్నా(Rashmika Mandanna) డీప్ ఫేక్(Deep Fake) వీడియో వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ వీడియోపై ఢిల్లీ(Delhi) పోలీసులు కేసు నమోదు చేశారు.

Deep Fake: రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో వివాదం.. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

ఢిల్లీ: ప్రముఖ హీరోయిన్, బ్యూటీ రష్మిక మందన్నా(Rashmika Mandanna) డీప్ ఫేక్(Deep Fake) వీడియో వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ వీడియోపై ఢిల్లీ(Delhi) పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా(Social Media) ప్లాట్‌ఫామ్‌లలో రష్మిక డీప్‌ఫేక్ వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. IPC, 1860.. సెక్షన్లు 465, 469, ఐటీ యాక్ట్ 2000లోని 66సీ, 66ఈ కింద కేసు నమోదు చేశారు. నటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ కావడం.. మీడియాలో వార్తలు సైతం రావడంతో ఢిల్లీ మహిళా కమిషన్(Womens Commission) సుమోటోగా స్వీకరించింది.


ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, నవంబర్ 17లోగా నిందితుల వివరాలు, తీసుకున్న చర్యలతో కూడిన ఎఫ్‌ఐఆర్(FIR) కాపీని ఇవ్వాలని కమిషన్ కోరింది. రష్మికా కూడా ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది. వీడియోలో తన చిత్రాన్ని చట్టవిరుద్ధంగా మార్ఫింగ్ చేసి వైరల్ చేయడాన్ని ఖండించింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మలివాల్ అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2023-11-11T11:42:06+05:30 IST