Deputy Speaker: డిప్యూటీ స్పీకర్‌కు తీవ్ర అస్వస్థత

ABN , First Publish Date - 2023-08-24T07:42:32+05:30 IST

పుదుచ్చేరి రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి రాజవేలు(Rajavelu) ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ని

Deputy Speaker: డిప్యూటీ స్పీకర్‌కు తీవ్ర అస్వస్థత

  • చెన్నైలోని ప్రైవేట్‌ ఆస్పతిలో చేరిక

అడయార్‌(చెన్నై): పుదుచ్చేరి రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి రాజవేలు(Rajavelu) ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ని హుటాహుటిన చెన్నైకు తరలించి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పుదువై నెట్టపాక్కం అసెంబ్లీ స్థానం నుంచి ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్న రాజవేలు (64).. ప్రస్తుత శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం పుదువైలో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొనగా, ఉన్నట్టుండి వాంతులు చేసుకోవడంతో అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ని హుటాహుటిన ఆయన భార్య మాలతి రాజవేలు, ఇతర కుటుంబ సభ్యులు చెన్నై జీహెచ్‌(Chennai GH)లో చేర్చారు. అక్కడ నుంచి నగరంలోని మరో కార్పొరేట్‌ ఆస్పత్రిలోని అత్యవసర సేవల విభాగానికి తరలించి చికిత్సలందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కొంతమేరకు మెరుగుపడినట్టు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి, మంత్రులు, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ శాసనసభ్యులు ఆయన కుటుంబ సభ్యులను ఫోనులో సంప్రదించి, డిప్యూటీ స్పీకర్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.

Updated Date - 2023-08-24T07:42:34+05:30 IST