Indian Army : దివ్యాంగులైన సైనికుల కోసం భారత సైన్యం అద్భుత నిర్ణయం!

ABN , First Publish Date - 2023-04-27T21:10:00+05:30 IST

విధి నిర్వహణలో క్షతగాత్రులైన సైనికులకు ఇది శుభవార్త. యుద్ధ రంగంలో పోరాడుతూ గాయపడి, దివ్యాంగులైన సైనికులను పారాలింపిక్స్

Indian Army : దివ్యాంగులైన సైనికుల కోసం భారత సైన్యం అద్భుత నిర్ణయం!
Indian Army

న్యూఢిల్లీ : విధి నిర్వహణలో క్షతగాత్రులైన సైనికులకు ఇది శుభవార్త. యుద్ధ రంగంలో పోరాడుతూ గాయపడి, దివ్యాంగులైన సైనికులను పారాలింపిక్స్ ఈవెంట్లలో ప్రోత్సహించాలని భారత సైన్యం నిర్ణయించింది. ప్రమాదాల్లో గాయపడి, క్రియాశీలక విధులకు అనర్హులైనవారు కూడా ఈ ప్రోత్సాహాన్ని అందుకోవచ్చునని తెలుస్తోంది. నూతన సవాళ్లను స్వీకరించి, జీవితంలో విజయం సాధించాలనే చైతన్యంగలవారు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చునని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఉదాహరణకు, షూటింగ్ నైపుణ్యంగలవారిని ఎంపిక చేసి, పారాలింపిక్స్ షూటింగ్ పోటీలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వవచ్చునని భారత సైన్యంలోని అధికారులు తెలిపారు. మిషన్ ఒలింపిక్ వింగ్‌లో ఇటువంటి శిక్షణనిచ్చే సంస్థలు ఉన్నాయని తెలిపారు.

ఇదేవిధంగా అథ్లెటిక్స్, రోయింగ్, ఆర్చరీ, స్విమ్మింగ్, షూటింగ్, పారా లిఫ్టింగ్, కయకింగ్, కెనోయింగ్ వంటివాటిలో దివ్యాంగ సైనికులకు శిక్షణనిచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని భారత సైన్యం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :

దలైలామా చేతికి రామన్‌ మెగసెసె అవార్డు

Modi Vs Jairam Ramesh : కాంగ్రెస్‌పై మోదీ వ్యాఖ్యలు.. ఘాటుగా బదులిచ్చిన జైరామ్ రమేశ్..

Updated Date - 2023-04-27T21:10:00+05:30 IST