BJP: ఉత్తరప్రదేశ్ రాజ్యసభ బీజేపీ అభ్యర్థిగా దినేష్ శర్మ

ABN , First Publish Date - 2023-09-03T16:02:59+05:30 IST

ఉత్తరప్రదేశ్ నుంచి తమ పార్టీ రాజ్యసభ్య అభ్యర్థిగా దినేశ్ శర్మ పేరును భారతీయ జనతా పార్టీ ఆదివారంనాడు ప్రకటించింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన 59 ఏళ్ల దినేశ్ శర్మ 2017 మార్చి నుంచి 2022 వరకూ ఉత్తప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.

BJP: ఉత్తరప్రదేశ్ రాజ్యసభ బీజేపీ అభ్యర్థిగా దినేష్ శర్మ

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ నుంచి తమ పార్టీ రాజ్యసభ్య అభ్యర్థిగా దినేశ్ శర్మ (Dinesh Sharma) పేరును భారతీయ జనతా పార్టీ (BJP) ఆదివారంనాడు ప్రకటించింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన 59 ఏళ్ల దినేశ్ శర్మ 2017 మార్చి నుంచి 2022 వరకూ ఉత్తప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. లక్నో మేయర్‌గా కూడా గతంలో సేవలు అందించిన ఆయన ఎమ్మెల్సీగా ఉండటంతో 2022లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎన్నికల అనంతరం ఆయన స్థానంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాజేష్ పాఠక్‌ను నియమించారు.


కాగా, షెడ్యూల్ ప్రకారం రాజ్యసభకు ఉప ఎన్నిక ఈనెల 15న జరగనుంది. బీజేపీ ఎంపీగా ఉన్న హరిద్వార్ డూబే ఇటీవల మరణించడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2026 వరకూ ఈ సీటు పదవీకాలం ఉంది. రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి తగినంత మెజారిటీ ఉన్నందున దినేశ్ శర్మ ఎంపిక నల్లేరుమీద నడకే కానుంది.

Updated Date - 2023-09-03T16:02:59+05:30 IST