RRR : ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్‌పై రాజ్యసభలో చర్చ
ABN , First Publish Date - 2023-03-14T12:57:14+05:30 IST
ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ రావడంపై రాజ్యసభ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఆస్కార్ గౌరవం అందరిదీ అని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
ఢిల్లీ : ఆర్ఆర్ఆర్ (RRR)కు ఆస్కార్ రావడంపై రాజ్యసభ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఆస్కార్ గౌరవం అందరిదీ అని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఆస్కార్ పురస్కారం లభించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం, ద ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ నిర్మాణం వెనుక అనేక వందలమంది కళాకారులు, టెక్నీషియన్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ గౌరవం వారందరికీ దక్కుతుందన్నారు. సృజనాత్మక కళకు కులం, మతం, భాష, ప్రాంతం అనే ఎల్లలు లేవని... ఉండకూడదన్నది తన అభిమతమని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR)లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకి ఆస్కార్ అవార్డు (Oscar Award) వచ్చిన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) ఆస్కార్ (Oscars95) పురస్కారాన్ని గెలుచుకుంది. 95వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందంపై సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ విషయం తెలిసి దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ సంతోషంలో మునిగిపోయారు. దీంతో రాజకీయ, సినీ ప్రముఖులు ఈ చిత్రబృందంపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు.