DMK: సీట్ల కేటాయింపు చర్చలు ప్రారంభించిన డీఎంకే
ABN , First Publish Date - 2023-09-26T10:43:14+05:30 IST
పార్లమెంటు ఎన్నికల్లో కూటమి పార్టీలకు సీట్లు కేటాయింపును డీఎంకే(DMK) ప్రారంభించింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల
పెరంబూర్(చెన్నై): పార్లమెంటు ఎన్నికల్లో కూటమి పార్టీలకు సీట్లు కేటాయింపును డీఎంకే(DMK) ప్రారంభించింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం జాతీయస్థాయిలో ప్రతిపక్ష పార్టీలు ఏకమై ‘ఇండియా’ పేరుతో కూటమి ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్, డీఎంకే, తృణముల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, ఆమ్ ఆద్మీ సహా పలు పార్టీలు ఈ కూటమిలో ఉన్నాయి. ఇక, రాష్ట్రంలో డీఎంకే నేతృత్వంలో కాంగ్రెస్, ఎండీఎంకే, సీపీఎం, సీపీఐ, డీపీఐ సహా పలు పార్టీలున్నాయి. ఈ నేపథ్యంలో, పార్లమెంటు ఎన్నికల్లో కూటమి పార్టీలకు కేటాయించాల్సిన సీట్లపై డీఎంకే చర్చలు ప్రారంభించింది. తొలుత స్థానిక అన్నా అరివాలయంలో ఇందియా యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నేతలతో డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ చర్చించారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఇందియా యూనియన్ ముస్లిం లీగ్‌కు రామనాథపురం నియోజకవర్గం కేటాయించగా, ఆ పార్టీ అభ్యర్థిగా నవాజ్ ఘనీ విజయం సాధించిన విషయం తెలిసిందే.