Share News

Bhupesh Baghel: కౌన్ బనేగా ఛత్తీస్‌గఢ్ సీఎం..?

ABN , First Publish Date - 2023-12-09T21:13:38+05:30 IST

ఛత్తీస్‌గఢ్ సీఎం ఎవరనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతుండటంపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేష్ బఘెల్ శనివారంనాడు వ్యంగ్యోక్తులు గుప్పించారు. ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలుసుకోవాలని తాము కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని వ్యాఖ్యానించారు.

Bhupesh Baghel: కౌన్ బనేగా ఛత్తీస్‌గఢ్ సీఎం..?

రాయపూర్: మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచి వారం రోజులవుతున్నా సీఎంల ఎంపికపై జరుగుతున్న జాప్యంపై వరుస విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ సీఎం ఎవరనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతుండటంపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేష్ బఘెల్ (Bhupesh Baghel) శనివారంనాడు వ్యంగ్యోక్తులు గుప్పించారు. ఎవరు ముఖ్యమంత్రి అవుతారో (Kaun Banega CM) తెలుసుకోవాలని తాము కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని వ్యాఖ్యానించారు. 'కౌన్ బనేగా కరోడ్‌పతి' తరహాలోనే 'కౌన్ బనేగా సీఎం' అనే సస్పెన్స్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతోందని శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.


కాగా, బీజేపీ నియమించిన ముగ్గురు కేంద్ర పరిశీలకులు అర్జున్ ముండా, సర్బానంద్ సోనోవాల్, దుష్యంత్‌ గౌతమ్‌లు శనివారంనాడు ఛత్తీస్‌గఢ్ చేరుకున్నారు. ఆదివారంనాడు బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరుగనుంది. మధ్యప్రదేశ్‌కు సైతం పార్టీ కేంద్ర పరిశీలకు ఆదివారం చేరుకోనున్నారు. 11న లెజిస్లేటివ్ పార్టీ సమావేశం కానుంది.


బీజేపీకి క్రమశిక్షణ లేదన్న అశోక్ గెహ్లాట్

కాగా, రాజస్థాన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సైతం బీజేపీ అధినాయకత్వం సీఎం ఎంపిక విషయంలో చేస్తు్న్న జాప్యాన్ని శనివారంనాడు నిలదీశారు. బీజేపీలో క్రమశిక్షణ లేదంటూ చురకలు అంటించారు. అదే పని తాము (కాంగ్రెస్) చేసి ఉంటే ఎన్ని అభియోగాలు చేసేవారో చెప్పలేనని అన్నారు. ఇప్పటికి ఏడు రోజులైనా ముఖ్యమంత్రి ఎంపిక చేయడంలో బీజేపీ జాప్యం చేస్తోందని, త్వరగా నిర్ణయం తీసుకోవాలని తాను కోరుతున్నానని చెప్పారు.

Updated Date - 2023-12-09T21:13:39+05:30 IST