Supreme Court: ఈడీ చీఫ్ పదవీకాలం పొడగింపునకు సుప్రీంకోర్ట్ గ్రీన్‌సిగ్నల్
ABN , First Publish Date - 2023-07-27T18:00:00+05:30 IST
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఛీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా (Sanjay Kumar Mishra) పదవికాలాన్ని 15 సెప్టెంబర్ 2023 వరకు పొడగింపునకు సుప్రీంకోర్ట్ (Supreme Court) అనుమతిచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తికి అత్యున్నత న్యాయస్థానం అంగీకారం తెలిపింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే కేంద్రం విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నట్టు కోర్ట్ తెలిపింది.
న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఛీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా (Sanjay Kumar Mishra) పదవికాలాన్ని 15 సెప్టెంబర్ 2023 వరకు పొడగింపునకు సుప్రీంకోర్ట్ (Supreme Court) అనుమతిచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తికి అత్యున్నత న్యాయస్థానం అంగీకారం తెలిపింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే కేంద్రం విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నట్టు కోర్ట్ తెలిపింది. కాగా ప్రస్తుతం కొనసాగుతున్న ఎఫ్ఏటీఎఫ్ (FATF) సమీక్షలో సంజయ్ కుమార్ గైర్హాజరైతే ప్రతికూల ప్రభావం చూపుతుందని, దేశ ప్రయోజనాల దృష్ట్యా అతడి పదవికాలం పొడగింపునకు అనుమతినివ్వాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం ఆశ్రయించిన విషయం తెలిసిందే.
కాగా.. ఈడీ చీఫ్‌గా ఉన్న సంజయ్ కుమార్ పదవి కాలాన్ని మూడోసారి పొడగించడం చట్టవిరుద్ధమవుతుందని జూలై 11న సుప్రీంకోర్ట్ విముఖత వ్యక్తం చేసింది. 2021 తీర్పునకు ఇది వ్యతిరేకమని తిరస్కరించింది. అయితే బదిలీ ప్రక్రియ సాఫీగా జరిగాలనే ఉద్దేశ్యంతో సంజయ్ కుమార్‌ను జులై 31, 2023 వరకు కొనసాగించేందుకు అనుమతిచ్చింది. అయితే ఎఫ్ఏటీఎఫ్ సమీక్ష కీలకమైన దశలో ఉందని, ఈ సమయంలో ఆయన గైర్హాజరైతే ఎదురయ్యే పరిణామాలను తెలియజేస్తూ జూలై 21, 2023న కోర్టుకు తెలియజేసింది. ఆన్-సైట్ విజిట్ నవంబర్ 2023లో జరగాల్సి ఉందని పేర్కొంది. దేశవ్యాప్తంగా మనీల్యాండరింగ్ దర్యాప్తులు, ప్రక్రియల్లో ఈడీ చీఫ్‌గా ఆయన చాలా ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాని వివరించారు.