Coal scam: బొగ్గు స్కాంలో 14 ప్రాంతాల్లో ఈడీ సోదాలు

ABN , First Publish Date - 2023-02-20T10:57:29+05:30 IST

ఛత్తీస్‌ఘడ్ బొగ్గు లెవీ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అధికారులు సోమవారం ఉదయం 14 ప్రాంతాల్లో సోదాలు ...

Coal scam: బొగ్గు స్కాంలో 14 ప్రాంతాల్లో ఈడీ సోదాలు
ED searches

న్యూఢిల్లీ : ఛత్తీస్‌ఘడ్ బొగ్గు లెవీ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అధికారులు సోమవారం ఉదయం 14 ప్రాంతాల్లో సోదాలు జరిపారు.(ED searches) ఛత్తీస్‌ఘడ్ (Chhattisgarh)రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ కోశాధికారి ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు చేశారు. ఈడీ దాడులు చేసిన వారందరూ ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్(CM Bhupesh Baghel) సన్నిహితులని సమాచారం. కోల్ లెవీ స్కాంలో(Coal levy scam) కొందరు రాజకీయ నేతలు, అధికారులు 540 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది.

ఇది కూడా చదవండి : Brazil : బ్రెజిల్‌లో భారీవర్షాలు...వెల్లువెత్తిన వరదలు, విరిగిపడిన కొండచరియలు...26 మంది మృతి

ఈడీ దాడుల నేపథ్యంలో సీఎం భూపేష్ బాగేల్ సోమవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కుంభకోణం నిధులను ఖైరాఘడ్ ఉప ఎన్నికకు వినియోగించారని ఈడీ ఆరోపించింది. ‘‘భారత్ జోడో యాత్ర విజయవంతమై అదానీకి సంబంధించిన నిజానిజాలు బట్టబయలు కావటంతో బీజేపీ నిరుత్సాహానికి గురైంది. ఈడీ రైడ్ దృష్టి మరల్చే ప్రయత్నం. దేశానికి నిజం తెలుసు. పోరాడి గెలుస్తాం’’అని సీఎం భూపేష్ బాగేల్ ట్వీట్ చేశారు.గత ఏడాది అక్టోబరులో ఈడీ జరిపిన దాడుల్లో రూ.4కోట్ల నగదు, ముఖ్యమైన కీలక పత్రాలు దొరికాయి.

Updated Date - 2023-02-20T11:15:53+05:30 IST