Eshwarappa: డీకే శివకుమార్‌కు మాజీమంత్రి సవాల్‌.. మీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఎవరిదో చెప్పండి

ABN , First Publish Date - 2023-07-28T12:11:04+05:30 IST

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి కేవలం రెండునెలలు మాత్రమే అయ్యిందని అప్పుడే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర సాగుతోందనే డీసీఎం డీకే శివకు

Eshwarappa: డీకే శివకుమార్‌కు మాజీమంత్రి సవాల్‌.. మీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఎవరిదో చెప్పండి

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి కేవలం రెండునెలలు మాత్రమే అయ్యిందని అప్పుడే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర సాగుతోందనే డీసీఎం డీకే శివకుమార్‌(DCM DK Shivakumar) వారి పేర్లను బహిరంగం చేయాలని బీజేపీ నేత, మాజీమంత్రి ఈశ్వరప్ప(Former Minister Eshwarappa) సవాల్‌ విసిరారు. గురువారం శివమొగ్గలో ఈశ్వరప్ప మీడియాతో మాట్లాడుతూ ప్రభుౄత్వాన్ని కూల్చేందుకు ఎవరు కుట్ర పన్నుతున్నారనేది బహిరంగం చేయాలన్నారు. సింగపూర్‌ సూత్రధారులెవరనేది చెప్పాలన్నారు. బీకే హరిప్రసాద్‌ ఏకంగా సీఎంను చేయడం వచ్చు దించడం కూడా వచ్చు అనడాన్ని ఏమని అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ కు చెందిన 30మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో రాసిన లేఖ నకిలీది అనేందుకు సాధ్యమే కాదన్నారు.

నకిలీ అయితే విచారణ జరపాలన్నారు. ఎమ్మెల్యే బీఆర్‌ పాటిల్‌(MLA BR Patil) నకిలీ లేఖ అంటే తాను సంతకం చేశానని బసవరాజరాయరెడ్డి వ్యాఖ్యలు ఏమని అర్థం చేసుకోవాలన్నారు. కాంట్రాక్టర్ల పెండింగ్‌ బిల్లులు 28వేల కోట్లు ఉన్నాయని, 40శాతం కమీషన్‌ తీసుకుంటున్నారని కాంట్రాక్టర్‌ సంఘం అధ్యక్షుడు కెంపణ్ణ ఆరోపించారని విషయాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్‌ ఏజెంట్‌లా కెంపణ్ణ వ్యవహరించారని ప్రస్తుతం కమీషన్‌ లేకుండా అందరికీ బిల్లులు ఇప్పించాలి కదా అంటూ డిమాండ్‌ చేశారు. డీజే హళ్ళి, కేజీ హళ్ళి అల్లర్లు దేశమంతటా సంచలనం కలిగిస్తే అమాయకులంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానమంటూ మండిపడ్డారు

Updated Date - 2023-07-28T12:15:28+05:30 IST