Delhi: ఓటర్ కార్డుతో ఆధార్ నెంబర్​ అనుసంధానం గడువు పెంపు

ABN , First Publish Date - 2023-03-22T15:12:49+05:30 IST

ఢిల్లీ: దేశంలో ఓటర్ కార్డు (Voter Card)తో ఆధార్ నెంబర్​ (Aadhaar Number) అనుసంధానం గడువును కేంద్ర ప్రభుత్వం (Central Govt) పొడిగించింది.

Delhi: ఓటర్ కార్డుతో ఆధార్ నెంబర్​ అనుసంధానం గడువు పెంపు

ఢిల్లీ: దేశంలో ఓటర్ కార్డు (Voter Card)తో ఆధార్ నెంబర్​ (Aadhaar Number) అనుసంధానం గడువును కేంద్ర ప్రభుత్వం (Central Govt) పొడిగించింది. 2023 ఏప్రిల్‌ 1 నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు గడువు పెంచింది. ఈ మేరకు బుధవారం కేంద్ర న్యాయ, జస్టిస్ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల (Notification Release) చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1తో ఆధార్‌తో ఓటర్ అనుసంధానానికి గడువు ముగుస్తుంది.

కాగా ఆధార్​తో ఓటర్ కార్డు అనుసంధానం కోసం ఫామ్​-6ను సమర్పించాల్సి ఉన్న ఓటర్లు గతేడాది ఆగస్టు నుంచి నమోదిత ఓటర్ల నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఆధార్‌ కార్డు నెంబర్లు సేకరించడం ప్రారంభించింది. డిసెంబర్‌ 12వ తేదీ వరకు 54.32 కోట్ల ఆధార్‌ నెంబర్లను ఈసీ సేకరించినట్లు సమాచారం.

ఆధార్‌ను అన్నింటికి అనుసంధానం చేయాల్సి వస్తోంది. మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ కార్డును అన్నింటికి అనుసంధానించేలా చర్యలు చేపడుతోంది. ఇక ఓటర్‌ ఐడీ కార్డుకు ఆధార్‌ నెంబర్‌ను అనుసంధానం చేయాలి. నకిలీ ఓట్లను అరికట్టడం, బోగస్‌ ఓటర్‌ ఐడీలను ఏరివేస్తూ పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి.

Updated Date - 2023-03-22T15:12:49+05:30 IST