New Parliament: కొత్త పార్లమెంట్ భవనం విశేషాలు ఇవే !
ABN , First Publish Date - 2023-05-24T20:42:25+05:30 IST
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈనెల 28న(ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాన మంత్రి మోదీ, లోక్‌సభ స్పీకర్ఓం ప్రకాశ్ బిర్లాతో కలిసి నూతన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేయనున్నారు.
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవనం(New Parliament Building) ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈనెల 28న(ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాన మంత్రి మోదీ(PM Modi), లోక్‌సభ స్పీకర్( Lok Sabha Speaker) ఓం ప్రకాశ్ బిర్లా(Om Prakash Birla)తో కలిసి నూతన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేయనున్నారు. 2021లో బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతన పార్లమెంట్ భవన నిర్మాణం చేపట్టింది. రూ. 970 కోట్లతో 64,500 చదరపు మీటర్ల స్థలంలో పార్లమెంట్ భవన నిర్మాణం చేశారు.
భారత్ పార్లమెంట్ పాత భవన్నాన్ని 1927లో నిర్మించారు. ఈ భవనాన్ని నిర్మించి దాదాపు వందేళ్లు కావస్తుండడం, ప్రభుత్వ ప్రస్తుత అవసరాల దృష్ట్యా నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి లోక్‌సభ, రాజ్యసభలు తీర్మానాలను ఆమోదించాయి. 2020 డిసెంబర్ 10న ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకస్థాపన చేశారు.
పాత పార్లమెంట్ భవనంలో లోక్‌సభ 545, రాజ్యసభలో 250 మంది సభ్యులు కూర్చునే సీటింగ్ కెపాసిటి ఉండేది. కొత్త భననంలో లోక్‌సభ 888 మంది సభ్యులు, రాజ్యసభలో 384 మంది సభ్యులు కూర్చునే సీటింట్ కెపాసిటీని ఏర్పాటు చేశారు.
కొత్త పార్లమెంట్ భవనంలో ఫీచర్స్(Features):
కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంలో 64,500 చదరపు మీటర్లు స్థలంలో నిర్మించారు.
సెంట్రల్ విస్తా భవన సముదాయ వరుసక్రమంలో త్రిభుజాకారంలో పార్లమెంట్ భవన నిర్మాణం చేపట్టారు. దీనిలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, రాజ్యాంగ బద్ధ సంస్థల కార్యాలయాలు ఉంటాయి.
కొత్త లోక్‌సభ ఛాంబర్‌ను జాతీయ పక్షి నెమలి ఆకృతిలో నిర్మించారు. అదేవిధంగా రాజ్యసభ ఛాంబర్‌ను జాతీయ పుష్పం ఆకృతిలో నిర్మించారు.
కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో నిర్మాణం భారతీయ నిర్మాణ వారసత్వం ప్రతిబింబించేలా నిర్మించినట్లు తెలుస్తోంది