Fire in Train:ఢిల్లీ-దర్భంగా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు
ABN , First Publish Date - 2023-11-15T19:03:16+05:30 IST
Indian Railways: ఉత్తర్ ప్రదేశ్‌లోని(Uttarpradesh) ఓ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో ట్రైన్(Train)లో నుంచి బయటకి దూకేశారు
లఖ్‌నవూ: ఉత్తర్ ప్రదేశ్‌లోని(Uttarpradesh) ఓ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో ట్రైన్(Train)లో నుంచి బయటకి దూకేశారు. ఈ ఘటనలో ఓ స్లీపర్ కోచ్ పూర్తిగా కాలిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ - దర్భంగా(Delhi - Darbhanga) సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉత్తర్ ప్రదేశ్‌లోని సరాయ్ భూపత్ స్టేషన్ గుండా వెళ్తుండగా అకస్మాత్తుగా ఓ స్లీపర్ బోగీలో మంటలు(Fire Accident) చెలరేగాయి.
స్టేషన్ మాస్టర్ మంటల్ని గమనించి రైల్వే సిబ్బందికి సమాచారం అందించాడు. అప్రమత్తమైన అధికారులు ఇటావాలో ట్రైన్ ని నిలిపేశారు. అప్పటికే కోచ్ మొత్తానికి మంటలు అంటుకున్నాయి.
ప్రాణ భయంతో ప్రయాణికులు వెంటనే అందులోంచి బయటకి దూకేశారు. చిక్కుకున్న వారిని సహాయక సిబ్బంది బయటకి తీశారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.
రైలులో సామర్థ్యానికిమించి ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిమాపకదళ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఘటనకు కారణాలేంటో ఇంకా తెలియరాలేదు. భారతీయ రైల్వే శాఖలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ట్రైన్ జర్నీ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.