Odisha Train Accident: ప్రమాద ఘటన స్థలంలో పట్టాలపైకి తొలి రైలు

ABN , First Publish Date - 2023-06-05T10:13:38+05:30 IST

ఒడిశా ఘోర రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే బాలాసోర్‌లో రైల్వే సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పునరుద్దరించి పట్టాలపై తొలి రైలు వెళ్తుండగా రైల్వే మంత్రి అక్కడే ఉన్నారు.

Odisha Train Accident: ప్రమాద ఘటన స్థలంలో పట్టాలపైకి తొలి రైలు

ఒడిశా(Odisha) ఘోర రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే బాలాసోర్‌లో(Balasore) రైల్వే సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్(Railway Minister Ashwini Vaishnaw) ప్రమాదం జరిగినప్పటి నుంచి ఘటనాస్థలంలోనే ఉండి పునరుద్దరణ పనులు పర్యవేక్షించారు. ప్రమాద ఘటన తర్వాత పట్టాలగుండా తొలి రైలు వెళ్తుండగా రైల్వే మంత్రి అక్కడే ఉన్నారు. కాగా.. రైల్వేచరిత్ర(Railway History)లో అత్యంత విషాదకరమైన ప్రమాదాల్లో ఒకటిగా ఈ ఘటన నిలిచింది. శుక్రవారం సాయంత్రం దేశాన్ని కుదిపేసిన ఈ పెను ప్రమాదంలో ఏకంగా 275 మంది ప్రాణాలు కోల్పోయారు. 1100 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.

పూర్తిగా ధ్వంసమైన రెండు ట్రాక్‌లను 51 గంటల్లోనే తిరిగి పునరుద్దరించారు. ఏకంగా వెయ్యిమంది కూలీలు, భారీగా యంత్రసామాగ్రిని ఉపయోగించి యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేశారు. ప్రస్తుతం రైళ్ల రాకపోకలకు ట్రాక్‌లు సిద్ధంగా ఉన్నాయని రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. పునరుద్దరించిన ట్రాక్‌పై గూడ్స్ రైలు వెళ్తుండగా తీసిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ సమయంలో రైల్వే మంత్రి ప్రార్థిస్తున్న దృశ్యం ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బాలాసోర్ ప్రమాద స్థలంలో అప్, డౌన్ రైల్వే ట్రాక్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయని రైల్వే మంత్రి చెప్పారు. ప్రమాదం జరిగిన కొద్ది గంటల్లోనే ట్రాక్‌లను పునరుద్దరించాం, ఆదివారం సాయంత్రం తొలి రైలు ట్రాక్‌లపై నడిచిందని ట్వీట్ చేశారు. దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం తర్వాత బాలాసోర్ రైల్వే ట్రాక్‌లపై తిరిగి కార్యకలాపాలను ప్రారంభమయ్యాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Updated Date - 2023-06-05T10:20:49+05:30 IST