Chandra Babu Arrest : మాజీ మంత్రి శ్రవణ్ కుమార్ అరెస్ట్, ఉండి ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్
ABN , First Publish Date - 2023-09-09T09:19:59+05:30 IST
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్ చేయడంతో ఆంధ్ర ప్రదేశ్‌లో తీవ్ర అలజడి నెలకొంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో దుకాణాలు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్ చేయడంతో ఆంధ్ర ప్రదేశ్‌లో తీవ్ర అలజడి నెలకొంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో దుకాణాలు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్‌ను అరకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఆర్టీసీ బస్సులను నిలిపేయడంతో ప్రజలు, పర్యటకులు నానా అవస్థలు పడుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తెలుగు దేశం పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
శుక్రవారం అర్థరాత్రి నుంచి పోలీసులు పెద్ద ఎత్తున నంద్యాలలో హైడ్రామా నడిపారు. చివరకు శనివారం ఉదయం 5:30 గంటల సమయంలో చంద్రబాబు బస చేసిన బస్సు డోర్ కొట్టారు. బస్సులో నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నట్లు డీఐజీ చెప్పారు. ఏ కేసులో ఏ నేరంలో తన వద్దకు వచ్చారు అని చంద్రబాబు ప్రశ్నించారు. తన హక్కులు ఉల్లంఘిస్తున్నారని. తాను తప్పు చేస్తే నడిరోడ్డులో ఉరేయండని తెలిపారు. అసలు ఏ చట్ట ప్రకారం తనను అరెస్ట్ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.