Former CM: మూడు రోజులుగా జ్వరం.. కారు ఎక్కబోతూ పడిపోయిన మాజీ సీఎం
ABN , First Publish Date - 2023-04-30T08:29:39+05:30 IST
రెండు మూడు రోజులుగా కాస్త జ్వరం.. ఒళ్లంతా కాలిపోతూనే ఉంది.. డాక్టర్ విశ్రాంతి తీసుకోమని సూచించినా లెక్కచేయకుండా
బళ్లారి(బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): రెండు మూడు రోజులుగా కాస్త జ్వరం.. ఒళ్లంతా కాలిపోతూనే ఉంది.. డాక్టర్ విశ్రాంతి తీసుకోమని సూచించినా లెక్కచేయకుండా ప్రచారం పర్వంలో మునిగిపోయిన ప్రతిపక్ష నేత సిద్దరామయ్య(Siddaramaiah) కారు ఎక్కబోతూ కిందకు పడబోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, అభిమానులు ఆయనను కిందపడకుండా పట్టుకున్నారు. శనివారం కూడ్లిగి నియోజక వర్గంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సిద్దరామయ్య అనంతరం మరోచోటుకు వెళ్లేందుకు కారెక్కడానికి వెళ్లారు. అలసట, నీరసంతో ఉన్న ఆయన సొమ్మసిల్లి కిందపడబోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, అనుచరలు పడబోయిన సిద్దరామయ్యను కాపాడండంతో ప్రమాదం తప్పింది. అక్కడే ఉన్న డాక్టర్ల వచ్చి సిద్దరామయ్యకు వైద్యం అందించారు.