Former CM: మాజీసీఎం ఆసక్తికర కామెంట్స్.. అమిత్‌షా కాళ్లు పట్టుకునే దుస్థితిలో మేము లేము..

ABN , First Publish Date - 2023-09-28T12:25:05+05:30 IST

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Amit Shah) కాళ్ళు పట్టుకునే దుస్థితిలో లేమని జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి(Former CM Kumaraswamy) అన్నారు.

Former CM: మాజీసీఎం ఆసక్తికర కామెంట్స్.. అమిత్‌షా కాళ్లు పట్టుకునే దుస్థితిలో మేము లేము..

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Amit Shah) కాళ్ళు పట్టుకునే దుస్థితిలో లేమని జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి(Former CM Kumaraswamy) అన్నారు. బుధవారం బెంగళూరు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... కేంద్రమంత్రి అమిత్‌షా కాళ్ళు పట్టుకునేందుకు ఢిల్లీ వెళ్ళారనే రాష్ట్ర ఐటీబీటీ శాఖా మంత్రి ప్రియాంకఖర్గే(Minister Priyanka Kharge) వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. దేవేగౌడ ఇంటికి వచ్చి కాళ్ళు పట్టుకుంది మీరే అనేది మరువరాదన్నారు. గతం గురించి తెలుసుకోవాలని సవాల్‌ విసిరారు. మేం మైత్రిగా ఏర్పడింది కేవలం రాజకీయాలు చేసేందుకు కాదని రాష్ట్రంలో సమస్యలలో కూరుకుపోతున్న రైతుల రక్షణకు అండగా నిలువదలచామన్నారు. బీజేపీ, జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యే లు అందరూ నేతలు యడియూరప్ప, సదానందగౌడ, నళిన్‌కుమార్‌ కటీల్‌ల సమక్షంలోనే పోరాటాలు చేస్తామన్నారు. కావేరి జలాల విషయంలో అఖిలపక్ష భేటీ ముందుగా ఎందుకు జరుపలేదన్నారు. డిమాండ్‌ చేశాక సభ జరిపినా మా సలహాలను పరిగణించలేదన్నారు. మండ్యలో తీవ్రమైన పోరాటం సాగుతోందన్నారు. ప్రభుత్వం ట్రిబ్యునల్‌ తీర్పు తర్వాత కూడా తప్పిదమే చేసిందన్నారు. స్వతంత్ర కమిటీ ఉండాలని సుప్రీం సూచించిందని 14 ఏళ్ళతర్వాత ఇటువంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. క్లిష్టపరిస్థితి ముగిసేదాకా వివాదం కొనసాగనుందన్నారు. రెండురాష్ట్రాలకు అన్యాయం జరగకుండా సమాఖ్య వ్యవస్థకు గౌరవం ఇవ్వాలన్నారు. మేం కావేరి విషయంలో రాజకీయం చేయడం లేదని రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చర్యలు ఉండాలనేది డిమాండ్‌ అన్నారు.

Updated Date - 2023-09-28T12:25:05+05:30 IST